ఐదు రోజుల్లో రూ.83,702 కోట్ల డిపాజిట్లు: ఎస్బీఐ | Sakshi
Sakshi News home page

ఐదు రోజుల్లో రూ.83,702 కోట్ల డిపాజిట్లు: ఎస్బీఐ

Published Tue, Nov 15 2016 1:32 AM

ఐదు రోజుల్లో రూ.83,702 కోట్ల డిపాజిట్లు: ఎస్బీఐ

ముంబై: కేంద్ర ప్రభుత్వపు కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో గత ఐదు రోజుల్లో తమకు రూ.83,702 కోట్ల డిపాజిట్లు వచ్చాయని ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ ఎస్‌బీఐ తెలిపింది. నవంబర్ 10 నుంచి 14 వరకు (సాయంత్రం 5 గంటల వరకు) రూ.4,146 కోట్ల విలువైన నోట్లను ఎక్స్చేంజ్ చేశామని పేర్కొంది. గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా చాలా బ్రాంచులు సోమవారం పనిచేయకపోరుునా కూడా, దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడక్కడ బ్యాంకులు పనిచేశాయని తెలిి పంది. నవంబర్ 10 నుంచి ఎస్‌బీఐ బ్యాంక్ శాఖల ద్వారా జరిగిన విత్‌డ్రాయెల్స్ రూ.9,342 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. ఇక ఏటీఎం విత్‌డ్రాయెల్స్ రూ.1,958 కోట్లుగా నమోదయ్యాయని తెలిపింది. క్యాష్ డిపాజిట్స్ మెషీన్ల ద్వారా జరిగిన కస్టమర్ల డిపాజిట్లు రూ.4,654 కోట్లు (పాత నోట్లు)గా ఉన్నాయని వివరించింది.

Advertisement
Advertisement