ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు: మాల్యా | Sakshi
Sakshi News home page

ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు: మాల్యా

Published Tue, Mar 15 2016 8:58 AM

ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు: మాల్యా

తాను సండే గార్డియన్ సహా ఏ మీడియాకూ ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదని విజయ్ మాల్యా చెప్పారు. తన ప్రోటాన్‌మెయిల్ అకౌంటు నుంచి వాళ్ల రిపోర్టర్‌కు మెయిల్ చేశానని సండే గార్డియన్ చెప్పడం చూసి తాను షాకయ్యానని మాల్యా ట్వీట్ చశారు. అసలు ఇప్పటివరకు తాను ప్రోటాన్‌మెయిల్ అనే ఈమెయిల్ గురించి విననే లేదని చెప్పారు. తనకు ప్రోటాన్‌మెయిల్ ఈమెయిల్ అకౌంటు లేదని స్పష్టం చేశారు. తాను వాళ్ల రిపోర్టర్లకు ఈమెయిల్ ఇంటర్వ్యూ ఇచ్చానని సండే గార్డియన్ పత్రిక చెప్పడం మొత్తం తప్పేనని ఆయన స్పష్టం చేశారు.

తాను ఇప్పట్లో భారతదేశానికి రావడం అంత సేఫ్ కాదని, అందువల్ల కొన్నాళ్ల పాటు విదేశాల్లోనే ఉంటానని ఆయన చెప్పినట్లుగా సండే గార్డియన్ ఇంటర్వ్యూలో ప్రచురించడం, దాన్ని వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచురించడం తెలిసిందే. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి అసలు తాను ఇంటర్వ్యూయే ఇవ్వలేదని ఆయన చెప్పడం సంచలనం సృష్టించింది.

 

Advertisement
Advertisement