Sakshi News home page

డిక్సన్‌ టెక్నాలజీస్‌.. హిట్‌

Published Tue, Sep 19 2017 12:54 AM

డిక్సన్‌ టెక్నాలజీస్‌.. హిట్‌

ముంబై: డిక్సన్‌ టెక్నాలజీస్‌ షేరు లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. సోమవారం లిస్టయిన కంపెనీ షేరు ఇష్యూ ధర రూ. 1,766తో పోలిస్తే 64 శాతం భారీలాభంతో ముగిసింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధరకంటే 54 శాతం అధికంగా రూ. 2,725 వద్ద లిస్టయిన డిక్సన్‌..చివరకు రూ. 2,893 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఇది రూ. 3,020స్థాయిని సైతం తాకింది. ఎన్‌ఎస్‌ఈలో కూడా ఇదేబాటలో రూ. 2,992 వద్ద డిక్సన్‌ ముగిసింది.

భారత్‌ రోడ్‌ నెట్‌వర్క్‌.. ప్చ్‌
ముంబై: శ్రేయీ ఇన్‌ఫ్రా గ్రూప్‌ కంపెనీ భారత్‌ రోడ్‌ నెట్‌వర్క్‌ షేర్లు సోమవారం ఫ్లాట్‌గా లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ. 205తో పోలిస్తే ఈ బీఎస్‌ఈలో రూ. 204.90 వద్ద లిస్ట్‌కాగా, చివరకు 1.53 శాతం స్వల్పలాభంతో రూ. 208.15 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ. 219–196 శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. ఎన్‌ఎస్‌ఈలో 1.68 శాతం లాభంతో రూ. 208.45 వద్ద ముగిసింది.  

త్వరలో న్యూఇండియా అష్యూరెన్స్‌ ఐపీఓ
ముంబై: న్యూఇండియా అష్యూరెన్స్‌ ప్రతిపాదించిన తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. దేశంలో అతిపెద్ద సాధారణ బీమా కంపెనీ అయిన న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీ జారీచేసే ఐపీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వం 9.6 కోట్ల షేర్లు విక్రయించనుండగా, మరో 2.4 కోట్ల షేర్లను కంపెనీ తాజాగా జారీచేస్తున్నది. మొత్తం 12 కోట్ల షేర్ల విక్రయం ద్వారా దాదాపు రూ. 6,400 కోట్లకుపైగా సమీకరించనున్నట్లు సమాచారం.

ఐపీవోతో దారిలో ఎన్‌ఐసీ: కాగా, ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీ నేషనల్‌ ఇన్సూరెన్స్‌ (ఎన్‌ఐసీ) త్వరలో ఐపీవో ద్వారా రూ.4,000 – 5,000 కోట్ల నిధుల్ని సమీకరించనుంది.

Advertisement

What’s your opinion

Advertisement