డీఎల్‌ఎఫ్ నికర లాభం 5 శాతం డౌన్ | Sakshi
Sakshi News home page

డీఎల్‌ఎఫ్ నికర లాభం 5 శాతం డౌన్

Published Fri, Aug 14 2015 12:30 AM

డీఎల్‌ఎఫ్ నికర లాభం 5 శాతం డౌన్

రూ. 128 కోట్ల నుంచి రూ. 122 కోట్లకు
వడ్డీ భారం రూ. 558 కోట్ల నుంచి రూ. 604 కోట్లకు...
ఆదాయం  రూ. 2,346 కోట్లు
 
 న్యూఢిల్లీ : రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 5 శాతం క్షీణించింది. గత క్యూ1లో రూ.128 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.122 కోట్లకు తగ్గిందని డీఎల్‌ఎఫ్ పేర్కొంది. నిర్వహణ ఆదా యం మాత్రం రూ.1,725 కోట్ల నుంచి 2,231 కోట్లకు పెరిగిందని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,852 కోట్ల నుంచి రూ.2,346 కోట్లకు పెరిగిందని వివరించింది. వడ్డీ భారం రూ.558 కోట్ల నుంచి రూ.604 కోట్లకు ఎగసిందని పేర్కొంది. స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన చూస్తే గత క్యూ1లో రూ.73 కోట్ల నికర లాభంరాగా, ఈ క్యూ1లో రూ.102 కోట్ల నష్టాలు వచ్చాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement