వాణిజ్య వాహనాల విక్రయాలు పుంజుకుంటాయ్! | Sakshi
Sakshi News home page

వాణిజ్య వాహనాల విక్రయాలు పుంజుకుంటాయ్!

Published Tue, Apr 15 2014 1:45 AM

వాణిజ్య వాహనాల విక్రయాలు పుంజుకుంటాయ్!

ముంబై: వాణిజ్య వాహనాల అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం తగ్గాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఆర్థిక మందగమనం, వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉండడం వంటి కారణాల వల్ల అమ్మకాలు ఈ స్థాయిలో క్షీణించాయని పేర్కొంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగం నుంచి అమ్మకాలు పుంజుకోగలవని అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు తక్కువగా ఉండడం (లో బేస్), ట్యాక్సీ ఆపరేటర్లు కాలం చెల్లిన వాహనాల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయనుండడం, క్రమక్రమంగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల కారణంగా అమ్మకాలు పెరుగుతాయని పేర్కొంది.

వాణిజ్య వాహనాల విక్రయాలపై ఇక్రా వెల్లడించిన వివరాల ప్రకారం..,
 2012-13 ఆర్థిక సంవత్సరంలో 2 శాతం తగ్గిన వాణిజ్య వాహనాల అమ్మకాలు 2013-14 ఆర్థిక సంవత్సరంలో 20% తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరంలో 6.33 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి.

  ఇటీవల కాలంలో వాహన పరిశ్రమ అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది.

 గత కొన్నేళ్లుగా నిలకడైన వృద్ధిని సాధించిన తేలిక రకం వాణిజ్య వాహనాల అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 18 శాతం తగ్గాయి. ఇక మధ్య తరహా, భారీ వాణిజ్య వాహనాల విక్రయాలు 25 శాతం క్షీణించాయి.

 వాహన పరిశ్రమలో ఆశావహ పరిస్థితులున్నప్పటికీ, కంపెనీలు తేలిక రకం, భారీ తరహా, వాణిజ్య వాహనాల సెగ్మెంట్లో కొత్త మోడళ్లను అందుబాటులోకి తేనున్నాయి.

{పస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం నుంచి అమ్మకాలు పుంజుకునే అవకాశాలున్నప్పటికీ, వాహన కంపెనీల లాభదాయకత మెరుగుపడే అవకాశాల్లేవు. తీవ్రమైన పోటీ, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, తదితర అంశాలు వాహన కంపెనీల లాభదాయకతపై ప్రభావం చూపనున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement