Sakshi News home page

ఈక్విటాస్కు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తుది లెసైన్స్

Published Sat, Jul 2 2016 1:32 AM

ఈక్విటాస్కు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తుది లెసైన్స్

ముంబై: స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఎస్‌ఎఫ్‌బీ)ను ప్రారంభించడానికి ఈక్విటాస్ హోల్డింగ్స్‌కు ఆర్‌బీఐ తుది లెసైన్స్‌ను మంజూరు చేసింది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఈక్విటాస్ బ్యాంక్) పేరుతో త్వరలో కార్యకలాపాలు నిర్వహిస్తామని ఈక్విటాస్ హోల్డింగ్స్ ఎండీ పి. ఎన్. వాసుదేవన్ చెప్పారు. ఆర్‌బీఐ, ఇతర ఏజెన్సీల నుంచి మరికొన్ని ఆమోదాలు రావల్సి ఉందని, అవి వచ్చిన తర్వాత ఎస్‌ఎఫ్‌బీ కార్యకలాపాలు ప్రారంభిస్తామని, ఏడాదిలో 400 బ్రాంచీలను ఏర్పాటు చేస్తామని వివరించారు.

ఈక్విటాస్ మైక్రో ఫైనాన్స్, ఈక్విటాస్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఈక్విటాస్ ఫైనాన్స్‌లో విలీనం కావడానికి గత నెలలోనే మద్రాస్ హైకోర్ట్ అనుమతిచ్చిందని తెలిపారు. ఈ కంపెనీల విలీనంతో ఈక్విటాస్ ఫైనాన్స్ కంపెనీ.... ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తుందని వివరించారు.  ఈ నేపథ్యంలో ఈక్విటాస్ హోల్డింగ్స్ షేర్ బీఎస్‌ఈలో 3.6 % లాభపడి రూ.184 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 8% లాభంతో ఏడాది గరిష్ట స్థాయి... రూ.191.5ను తాకింది. బీఎస్‌ఈలో 9.58 షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 49 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

Advertisement
Advertisement