భారత్లో జనరల్ ఏసీల ప్లాంటు | Sakshi
Sakshi News home page

భారత్లో జనరల్ ఏసీల ప్లాంటు

Published Sat, Dec 10 2016 1:34 AM

నూతన షోరూంలో ఇజాజుద్దీన్, పూవయ్య(కుడి) - Sakshi

చెన్నై వద్ద ఏర్పాటయ్యే చాన్‌‌స
రూ.200 కోట్ల దాకా పెట్టుబడి
సాక్షితో కంపెనీ డెరైక్టర్ ఇజాజుద్దీన్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జనరల్ బ్రాండ్‌తో ఎయిర్ కండీషనర్ల విపణిలో ఉన్న ఈటీఏ జనరల్ భారత్‌లో సొంత తయారీ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్న కంపెనీ ప్లాంటు నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. 2019 నాటికి తయారీ కేంద్రం రానుందని, ఇందుకు చెన్నై వేదికయ్యే అవకాశం ఉందని కంపెనీ డెరైక్టర్, సీఈవో ఎం.ఇజాజుద్దీన్ తెలిపారు. ఇక్కడి మలక్‌పేటలో మిట్టపల్లి ఎంటర్‌ ప్రైసెస్ ఏర్పాటు చేసిన జనరల్ ఆర్కేడ్ బ్రాండ్ స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు.

‘భారత్‌లో 2018 నుంచి బీఈఈ నూతన స్టార్ రేటింగ్ అమలు కానుంది. తయారీలో అనూహ్య మార్పులు రానున్నందున తదనుగుణంగా ప్లాంటును ఏర్పాటు చేస్తాం. ప్లాంటును గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దితే 30 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యంతో ఏర్పాటు చేస్తాం. కేవలం భారత్ కోసమైతే 5 లక్షల యూనిట్ల సామర్థ్యంతో వచ్చే అవకాశం ఉంది. కనీసం రూ.200 కోట్ల దాకా పెట్టుబడి అవసరం’ అని ఆయన చెప్పారు.

వచ్చే ఏడాది 20 మోడళ్లు..
జపాన్‌కు చెందిన ఫుజిట్సు జనరల్, దుబారుు కంపెనీ ఈటీఏ-ఆస్కాన్ స్టార్‌ల జారుుంట్ వెంచర్ అరుున ఈటీఏ జనరల్‌కు భారత ఏసీల విపణిలో 5 శాతం వాటా ఉంది. గతేడాది 2.2 లక్షల యూనిట్లను విక్రరుుంచింది. ప్రస్తుత సంవత్సరంలో 2.5 లక్షల యూనిట్లకు చేరుకుంటామని ఇజాజుద్దీన్ తెలిపారు. హైదరాబాద్‌లో 2, దేశవ్యాప్తంగా 50 బ్రాండ్ స్టోర్లున్నాయని చెప్పారు. 2017లో కొత్తగా 50 ఏర్పాటు చేస్తామన్నారు. 2016లో 5 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టామని వివరించారు. 2017 అక్టోబర్ తర్వాత 20 నూతన మోడళ్లను తీసుకొస్తామని పేర్కొన్నారు. నాణ్యత, ధర విషయంలో రాజీ పడబోమని, సూపర్ ప్రీమియం బ్రాండ్‌గా కొనసాగుతామని తెలిపారు. గదిలో 25 మీటర్ల దాకా పనిచేసే ఏసీని దేశంలో తొలిసారిగా అందుబాటులోకి తెచ్చామన్నారు.

పెరగనున్న ధరలు..
కాపర్ ధర దిగిరావడంతో 2016 సీజన్‌లో వివిధ కంపెనీల ఏసీల ధర 5 శాతం దాకా తగ్గింది. కాపర్ ధర తిరిగి పెరుగుతున్నందున వచ్చే సీజన్‌లో 5 శాతం దాకా ఏసీల ధర అధికమయ్యే చాన్‌‌స ఉందని కంపెనీ సీనియర్ జీఎం కె.సి.పూవయ్య తెలిపారు. 2018 జనవరి 1 నుంచి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) కొత్త రేటింగ్ అమలులోకి రానున్నందున తయారీ విధానంలో మార్పులకు కంపెనీలు వ్యయం చేయాల్సి ఉంటుందని చెప్పారు. పరిశ్రమలో ఏసీల ధరలు ఎంత కాదన్నా ఆ సమయానికి 10-15 శాతం అధికం అవుతాయని వెల్లడించారు. మొత్తం విపణిలో 13 శాతం వాటా ఉన్న ఇన్వర్టర్ ఏసీల వృద్ధిరేటు అధికంగా 30 శాతముందని తెలిపారు. భవిష్యత్ ఇన్వర్టర్ ఏసీలదేనని పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement