ఫెడ్‌ రేట్లు పావు శాతం పెంపు | Sakshi
Sakshi News home page

ఫెడ్‌ రేట్లు పావు శాతం పెంపు

Published Thu, Jun 14 2018 12:40 AM

Fed Raises Interest Rates and Sees 2018 Unemployment  - Sakshi

వాషింగ్టన్‌: అంచనాలకు తగ్గట్లుగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ (ఫెడ్‌) కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. దీంతో వడ్డీ రేట్ల శ్రేణి 1.75 – 2 శాతానికి చేరింది.  ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌వోఎంసీ) ఏకగ్రీవంగా రేట్ల పెంపునకు ఆమోదముద్ర వేసింది. ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్ల పెంపు క్రమానుగతంగా ఉంటుందని సూచనప్రాయంగా తెలిపింది. 2018, 2019 ద్రవ్యోల్బణం అంచనాలను కూడా పెంచింది.

వడ్డీ రేట్లకు సంబంధించి ఉదారవాద ధోరణే కొనసాగించనున్నట్లు ఫెడ్‌ పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2.8 శాతం పైగా ఉండొచ్చని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటంతో పాటు ఉద్యోగాల కల్పన పటిష్టంగా జరుగుతోందని పేర్కొంది. 2018లో నిరుద్యోగిత రేటు అంచనాలను 3.6 శాతానికి తగ్గించింది.  2019లో మూడు సార్లు, 2020లో మరో ఒక దఫా రేట్ల పెంపు ఉండనుంది. కాగా, ఈ ఏడాది మరో రెండు సార్లు రేట్ల పెంపు ఉండొచ్చని ఫెడ్‌ సంకేతాలిచ్చింది. అలాగే, 2019, 2020 సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం 2 శాతం పైనే ఉంటుందని కూడా అంచనా వేసింది. 

Advertisement
Advertisement