భారత్ వృద్ధి అంచనాకు ఫిచ్ కోత | Sakshi
Sakshi News home page

భారత్ వృద్ధి అంచనాకు ఫిచ్ కోత

Published Thu, Oct 1 2015 12:27 AM

భారత్ వృద్ధి అంచనాకు ఫిచ్ కోత - Sakshi

7.8 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి రేటు అంచనాను  రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ బుధవారం 7.8 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించింది. అయితే ఆర్థిక సంస్కరణల అమలుతో వచ్చే ఆర్థిక సంవత్సరం 8 శాతం వృద్ధి సాధించే సత్తా దేశానికి ఉందని ఫిచ్ తన తాజా నివేదికలో పేర్కొంది. తన తాజా రేటు కోతకు బలహీన రుతుపవన పరిస్థితులను కారణంగా ఫిచ్ పేర్కొంది. భారత్ స్థూల దేశీయోత్పత్తి క్యూ1లో 7 శాతంగా నమోదయిన నేపథ్యంలో పలు రేటింగ్, విశ్లేషణా సంస్థలు దేశ వృద్ధికి సంబంధించి తమ అంచనాలకు కోతపెట్టాయి.

మంగళవారం రిజర్వ్ బ్యాంక్ కూడా అంచనాను 7.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది.  ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్, ఎన్‌సీఏఈఆర్‌లు ఈ రేటును 7.5 శాతంగా అంచనావేస్తున్నాయి. ఏడీబీ, డీఎస్‌బీ 7.4 శాతంగా అంచనావేస్తున్నాయి. యూబీఎస్ అంచనా 7.1 శాతం. అయితే మూడీస్ అంచనా అతి తక్కువగా  7 శాతంగా ఉంది. కాగా ఆర్థిక మంత్రిత్వశాఖ మాత్రం ఇప్పటికీ 8 నుంచి 8.5 శాతం శ్రేణిలో తన అంచనాను కొనసాగిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement