మొబైల్‌ యాప్‌లో దూసుకుపోతున్న ఫ్లిప్‌కార్ట్‌ | Sakshi
Sakshi News home page

మొబైల్‌ యాప్‌లో దూసుకుపోతున్న ఫ్లిప్‌కార్ట్‌

Published Sat, Oct 14 2017 4:30 PM

Flipkart app crosses 100 million downloads mark on Google Play Store - Sakshi

ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైలర్‌ ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్‌ అప్లికేషన్‌ డౌన్‌లోడ్లలో దూసుకుపోతుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ రిటైలర్‌ యాప్‌ 100 మిలియన్‌ డౌన్‌లోడ్లను అంటే 10 కోట్ల మార్కును అధిగమించింది. ఈ మైలురాయిని అధిగమించిన దేశంలోనే తొలి ఈ-కామర్స్‌ యాప్‌ ఫ్లిప్‌కార్ట్‌దేనని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 300 మిలియన్ల మంది స్మార్ట్‌ఫోన్‌ యూజర్లున్నారు. అంటే దేశంలోని అన్ని స్మార్ట్‌ఫోన్లలో ఫ్లిప్‌కార్ట్‌ మూడోవంతులున్నట్టు పేర్కొంది. 

గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఇచ్చే రేటింగ్‌లోనూ ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌కు మంచి రేటింగ్‌ వస్తుంది. అవుట్‌ ఆఫ్‌ 5 రేటింగ్‌కు సగటున 4.4 రేటింగ్‌ వస్తుందని కంపెనీ చెప్పింది. కొత్త కొత్త ఫీచర్ల అభివృద్ధికి తాము ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నామని, తమ యాప్‌లో తాజా డిజైన్‌లను చేకూరుస్తూ.. యూజర్లకు అనుకూలంగా మారుస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ సీటీఓ రవి గరికిపాటి చెప్పారు. కాగ, ప్లిప్‌కార్ట్‌ తన బిగ్‌ దివాలి సేల్‌ను నేటి నుంచి ప్రారంభించింది. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌, హోమ్‌, ఫర్నీచర్‌ వంటి కేటగిరీ ఉత్పత్తులపై డీల్స్‌ను, డిస్కౌంట్లను అందిస్తోంది. కొన్ని ఉత్పత్తులపై 90 శాతం వరకు డిస్కౌంట్లను కూడా ఈ ఈ-కామర్స్‌ స్టార్టప్‌ ఆఫర్‌ చేస్తోంది.

Advertisement
Advertisement