ఫ్లిప్ కార్ట్ కొత్త పేమెంట్ విధానం ‘నో కాస్ట్ ఈఎంఐ’ | Sakshi
Sakshi News home page

ఫ్లిప్ కార్ట్ కొత్త పేమెంట్ విధానం ‘నో కాస్ట్ ఈఎంఐ’

Published Wed, Jun 1 2016 1:43 AM

ఫ్లిప్ కార్ట్ కొత్త పేమెంట్ విధానం ‘నో కాస్ట్ ఈఎంఐ’ - Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా వినియోగదారుల కోసం కొత్త పేమెంట్ విధానం ‘నో కాస్ట్ ఈఎంఐ’ను ప్రవేశపెట్టింది. ఇక్కడ కస్టమర్లు ప్రాసెసింగ్ ఫీజు, డౌన్ పేమెంట్, వడ్డీ వంటివి లేకుండా ఒక వస్తువును, దాని అసలు ధరకే ఈఎంఐలు చెల్లించి సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఇందుకోసం కోసం బజాజ్ ఫిన్‌సర్వ్‌తో, ఇతర ప్రముఖ బ్రాండ్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇక్కడ ఎంపిక చేసిన వస్తువులకు మాత్రమే ఈ సౌలభ్యం అందుబాబులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఖరీదైనా వస్తువుల కొనుగోలును సులభతరం చేయడం కోసం సంస్థ ఈ విధానాన్ని తీసుకువచ్చింది. కాగా ఈ సౌకర్యం ప్రస్తుతం యాప్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. అలాగే ఈ విధానంలో వస్తువులను కొనుగోలు చేయానుకుంటున్నా వారు బజాజ్ ఫిన్‌సర్వ్ జారీ చేసిన పర్చెస్ కార్డును కలిగి ఉండాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement