ఫ్లిప్ కార్ట్ కు ఏమైంది? | Sakshi
Sakshi News home page

ఫ్లిప్ కార్ట్ కు ఏమైంది?

Published Wed, May 18 2016 2:20 PM

ఫ్లిప్ కార్ట్  కు ఏమైంది? - Sakshi

న్యూయార్క్:  భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్  మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకుంటోందా.. ఇప్పటికే  వివిధ కంపెనీల్లో తన వాటాలను తగ్గించుకుంటూ వస్తున్న కంపెనీ ఇపుడు మరో అడుగు వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. అమెరికాలో తన ప్రధాన  పోటీదారు అమెజాన్ లో రెండింట మూడో వంతు వాటాలను 2016 జనవరి-మార్చి  క్వార్టర్ లో  తగ్గించుకున్నట్లు యూఎస్ సెక్ తెలిపింది. 618 మిలియన్ డాలర్ల విలువ చేసే 1.04 మిలియన్ల షేర్లను వదులుకున్నట్లు వివరించింది. అమెజాన్ తో పాటు ఆలీబాబా గ్రూప్ లో కూడా ఫ్లిప్ కార్ట్ బాగా వాటాలను తగ్గించినట్లు సెక్ తెలిపింది.

చైనీస్ ఈ-టెయిలర్ జేడీ.కామ్ లో 25 శాతం, ఆపిల్ లో 46 శాతం, జిల్లో గ్రూప్ లో 23.6 మిలియన్ల వాటాలను తగ్గించుకున్నట్లు సెక్ వివరించింది. భారతీయ ఈ-కామర్స్ రంగాన్ని శాసించేందుకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాస్ డీల్ కంపెనీలు పోటీ పడుతుండగా.. గత కొద్దికాలంగా ఫ్లిప్ కార్ట్ మార్కెట్ ఒడిదుడుకులకు గురౌతున్న విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement