ఫ్లిప్‌కార్ట్‌ బొనాంజా సేల్‌ : భారీ తగ్గింపు

15 Feb, 2020 17:37 IST|Sakshi

ఐఫోన్లపై ఆఫర్‌

రెనో 10 ఎక్స్ జూమ్ ఎడిషన్‌పై భారీ  తగ్గింపు

మొబైల్‌ బొనాంజా సేల్‌,  17- 21 వరకు

సాక్షి, ముంబై: ప్రముఖ ఆన్‌లైన్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్  వినియోగదారులకు శుభవార్త అందించింది. డిస్కౌంట్‌ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌ కొనాలని భావిస్తున్న వారికి  ’మొబైల్స్ బొనాంజా’ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌ ఫిబ్రవరి 17 న ప్రారంభమై ఫిబ్రవరి 21న  ముగియనుంది.  ఆపిల్‌,  శాంసంగ్‌, వివో, రియల్‌మీ  బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లను తగ్గింపుధరల్లో అందుబాటులో ఉంచనుంది.  ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్, మిడ్-రేంజ్,  బడ్జెట్ ఇలా స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపుల ధరలను  ప్రకటించింది.  అలాగే యాక్సిస్ బ్యాంక్ డెబిట్ , క్రెడిట్ కార్డులతో చేసిన అన్ని లావాదేవీలపై 10 శాతం తగ్గింపుదీనికి అదనం.

రూ.15 వేల  కేటగిరిలో శాంసంగ్‌ గెలాక్సీ ఏ50, వివో జెడ్‌1 ప్రొలు రూ.12,999 నుంచి రూ.11,990ధరలలో లభ్యం కానున్నాయి. వివోజెడ్‌1. రియల్‌మి ఎక్స్‌టీ  రూ.13,990, రూ,14,999 వద్ద తగ్గింపు ధరలలో లభ్యం కానున్నాయి. దాదాపు అన్ని రకాల మొబైల్స్‌ తగ్గింపు ధరలలో ఈ సేల్‌లో అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. 

వివో జెడ్ 1 ఎక్స్ , రియల్‌ మి  ఎక్స్‌టీ  స్మార్ట్‌ఫోన్లు  రూ. 13,990, 14,999 రూపాయల నుండి లభిస్తాయి. 
నోకియా  లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ 7.2  ధరను తగ్గించి రూ .15,499 కే లభ్య.
ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ ఎడిషన్‌ రూ.  రూ .26,990  దీని అసలు రూ. 40వేల నుంచి భారీ తగ్గింపు 


ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్

ఫ్లాగ్‌షిప్ కిల్లర్ రియల్‌మీ ఎక్స్ 2 ప్రో రూ .27,999   తగ్గింపు రూ. 2వేలు 
బ్లాక్ షార్క్ 2 గేమింగ్ స్మార్ట్‌ఫోన్ రూ .29,999 
పిక్సెల్ 3 ఎ సిరీస్ రూ .27,999 కంటే తక్కువకు లభించనుంది. 
అలాగే శాంసంగ్‌  గెలాక్సీ ఎస్ 9 సిరీస్ కూడా రూ .22,999 నుండి లభిస్తుంది.

రూ. 10, 000  లోపు స్మార్ట్‌ఫోన్లు
ఒప్పో కె 1 రూ .9,990 

ఐఫోన్లపై  తగ్గింపు
ఆండ్రాయిడ్‌ నుంచి ఐవోస్‌కు మారాలనుకుంటున్న వారికి కూడా ఫ్లిప్‌కార్ట్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఐఫోన్లపై  కూడా భారీ తగ్గింపును అందిస్తోంది.  ఐఫోన్ ఎక్స్‌ఎస్  ధర రూ. 54,999  నుండి ప్రారంభం ఐఫోన్ 8 ను రూ .35,999 కు పొందవచ్చు. 

  చదవండి : లేటెస్ట్‌ ఐఫోన్‌పై డిస్కౌంట్‌ ఆఫర్‌


 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు