ఫోర్డ్.. మస్టాంగ్ జీటీ వచ్చేసింది | Sakshi
Sakshi News home page

ఫోర్డ్.. మస్టాంగ్ జీటీ వచ్చేసింది

Published Wed, Jul 13 2016 12:30 AM

ఫోర్డ్.. మస్టాంగ్ జీటీ వచ్చేసింది - Sakshi

ధర రూ.65 లక్షలు
గరిష్ట వేగం 250 కి.మీ./గంటకు

 గ్రేటర్ నోయిడా : ఫోర్డ్ కంపెనీ తన ఐకానిక్  స్పోర్ట్స్ కారు మస్టాంగ్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. ఫోర్డ్ మస్టాంగ్ జీటీ పేరుతో అందిస్తున్న ఈ కారు  ధర రూ.65 లక్షలు(ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)అని ఫోర్డ్ ఇండియా కంపెనీ తెలిపింది.   మస్టాంగ్ బ్రాండ్ 52 సంవత్సరాల చరిత్రలో భారత్‌లో మస్టాంగ్ బ్రాండ్ కారును ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారని ఫోర్డ్ ఇండియా ఈడీ(మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్) అనురాగ్ మెహరోత్రా పేర్కొన్నారు.  ఈ కారును 5లీటర్ల వీ8 పెట్రోల్ ఇంజిన్‌తో రూపాందించామని,  గరిష్టవేగం గంటకు 250 కి.మీ. అని పేర్కొన్నారు.

 అమెరికాలోని ఫ్లాట్ రాక్ అసెంబ్లీ ప్లాంట్‌లో తయారైన ఈ కారును పూర్తిగా తయారైన కారు రూపంలో దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తామని అనురాగ్ పేర్కొన్నారు. గత ఏడాది నుంచే ఈ కారును ప్రపంచవ్యాప్తంగా విక్రయించడం ప్రారంభించామని,  మొదటి ఏడాదిలోనే 1.1 లక్షల మస్టాంగ్ కార్లను విక్రయించామని తెలిపారు. 1964 నుంచి ఇప్పటిదాకా 90 లక్షలకు పైగా మస్టాంగ్ కార్లను ఫోర్డ్ విక్రయించింది.

 కారు ప్రత్యేకతలు..
మస్టాంగ్‌లో ఆరవ జనరేషన్ కారు ఇది.  ఆరు స్పీడ్ సెలెక్ట్ షిఫ్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, స్టీరింగ్‌పై పెడల్ షిఫ్టర్స్, నాలుగు డ్రైవింగ్ మోడ్స్(నార్మన్, స్పోర్ట్‌ప్లస్, ట్రాక్, స్నో/వెట్ మోడ్స్),  ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ విత్ ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్‌ల్యాంప్స్, పోనీ ప్రొజెక్షన్ హెడ్‌ల్యాంప్స్, 19 అంగుళాల మాగ్నటిక్ గ్లోస్ పెయింట్  మెషిన్డ్ అల్యూమినియం వీల్స్, ట్రై బార్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, రివర్సింగ్ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, మోకాలి దగ్గర కూడా ఎయిర్‌బాగ్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement