17 సెన్సెక్స్ కంపెనీల్లో విదేశీ పెట్టుబడుల జోరు | Sakshi
Sakshi News home page

17 సెన్సెక్స్ కంపెనీల్లో విదేశీ పెట్టుబడుల జోరు

Published Mon, Oct 24 2016 2:37 AM

17 సెన్సెక్స్ కంపెనీల్లో విదేశీ పెట్టుబడుల జోరు - Sakshi

యాక్సిస్ బ్యాంక్‌లో అధిక పెట్టుబడులు
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.34,000 కోట్ల విలువైన సెన్సెక్స్ కంపెనీల షేర్లను కొనుగోలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో విదేశీ ఇన్వెస్టర్లు 17 సెన్సెక్స్ కంపెనీల్లో తమ వాటాను పెంచుకున్నారు. అయితే ఇదే కాలంలో 12 సెన్సెక్స్ కంపెనీల్లో తమ వాటాను తగ్గించుకున్నారు. ఈ 12 కంపెనీల్లో వీరు 6,180 కోట్ల షేర్లను విక్రయించారు. నికరంగా ఈ క్వార్టర్లో విదేశీ ఇన్వెస్టర్ల సెన్సెక్స్ కంపెనీల పెట్టుబడులు రూ.27,700 కోట్లుగా ఉన్నాయి. ఒక కంపెనీ గణాంకాలు లభ్యం కాలేదు. ఈ క్వార్టర్‌లో విదేశీ ఇన్వెస్టర్ల సెన్సెక్స్ కంపెనీల పెట్టుబడులకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు...

సెన్సెక్స్ కంపెనీల్లో అధికంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు యాక్సిస్ బ్యాంక్‌లోకి వచ్చాయి. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో 45.81 శాతంగా ఉన్న ఈ కంపెనీలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో 4.94 శాతం పెరిగి 50.75 శాతానికి చేరాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో వీరి పెట్టుబడులు 8.24 శాతం నుంచి 12.86 శాతానికి వృద్ధి చెందాయి.

అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, హీ రో మోటొకార్ప్, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కంపెనీల్లో వీరి పెట్టుబడులు పెరిగాయి.

ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, గెయిల్ ఇండియా తదితర కంపెనీల్లో వీరి పెట్టుబడులు తగ్గాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement