కోటిన్నర కార్ల భవిష్యత్‌ తేలేది నేడే | Sakshi
Sakshi News home page

కోటిన్నర కార్ల భవిష్యత్‌ తేలేది నేడే

Published Thu, Feb 22 2018 6:40 PM

German court to decide on fate of 15 million diesel cars - Sakshi

2015లో ఫోక్స్‌వాగన్‌ చీటింగ్‌ కేసు బయటికి వచ్చినప్పటి నుంచి డీజిల్‌ ఇంజిన్‌ కార్లపై ఇటు పర్యావరణవేత్తలు, అటు ప్రభుత్వాలు, కోర్టులు వాటిపై తీవ్ర దృష్టిసారించాయి. కర్బన్‌ ఉద్గారాలు ఎక్కువగా ఉన్న ఈ కార్లపై ప్రపంచవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జర్మన్‌లోని కోటిన్నర డీజిల్‌ కార్ల భవిష్యత్‌ నేడు తేలబోతుంది. ఈ కార్లు జర్మన్‌ నగర రోడ్లపై నడవాలో వద్దో జర్మన్‌ కోర్టు నేడు తేల్చబోతుంది. పర్యావరణ గ్రూప్‌ డీయూహెచ్‌ వేసిన దావాలో యూరోపియన్‌ యూనియన్‌ పరిమితులకు మించి సుమారు కోటిన్నర డీజిల్‌ కార్లు ఎక్కువ మొత్తంలో ఉద్గారాలను కలిగి ఉన్నట్టు తెలిసింది. 

తాజా ప్రమాణాలకు అనుగుణంగా లేని, కాలుష్యం భారీగా ఉన్న డీజిల్ కార్లపై నిషేధం విధించాలని స్థానిక కోర్టులు ఆదేశించాయి. ఈ ఆదేశాలపై జర్మన్‌ రాష్ట్రాలు అప్పీల్‌ పెట్టుకున్నాయి. దీనిపై నేడు జర్మన్‌ కోర్టు నిర్ణయం ప్రకటించనుంది. ఈ విషయం కేవలం జర్మన్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. మరికొన్ని అతిపెద్ద కార్ల తయారీదారుల ఖండాలకు కూడా విస్తరించింది. పారిస్‌, మెక్సికో సిటీ, అథెన్స్‌ అధికారులు కూడా 2025 నాటికి తమ నగరాల్లో డీజిల్‌ వాహనాలు తిరగకుండా నిషేధం విధిస్తామని తెలిపాయి. వచ్చే ఏడాది నుంచి తమ నగరంలోకి కొత్త డీజిల్‌ కార్లు రాకుండా నిషేధం విధిస్తామని ఇటు కోపెన్హాగన్ మేయర్‌ కూడా చెప్పారు. ఫ్రాన్స్‌, బ్రిటన్‌లు కూడా 2040 నాటికి కొత్త పెట్రోల్‌, డీజిల్‌ కార్లను బ్యాన్‌ చేసి, ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌లోకి మారతామని తెలిపాయి.  

Advertisement
Advertisement