రెడ్డీస్‌కు జర్మనీ రెగ్యులేటర్‌ షాక్‌ | Sakshi
Sakshi News home page

రెడ్డీస్‌కు జర్మనీ రెగ్యులేటర్‌ షాక్‌

Published Fri, Aug 11 2017 1:34 AM

German Regulator Denies GMP Nod To Dr Reddy Labs Unit

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌కు జర్మనీ ఔషధ నియంత్రణ సంస్థ షాక్‌ ఇచ్చింది. హైదరాబాద్‌ సమీపంలోని బాచుపల్లి వద్ద ఉన్న ఫార్ములేషన్స్‌ తయారీ యూనిట్‌–2కు జీఎంపీ ధ్రువీకరణను పునరుద్ధరించలేదు. ఈ మేరకు జర్మనీలోని రెడ్డీస్‌ అనుబంధ కంపెనీ అయిన బెటాఫార్మ్‌కు సమాచారం ఇచ్చింది.

తాజా పరిస్థితుల నేపథ్యంలో యూనిట్‌–2 నుంచి యూరోపియన్‌ యూనియన్‌కు ఔషధ ఎగుమతులు చేయడానికి రెడ్డీస్‌కు వీలు లేకుండా పోయింది. ఇటీవలే ఈ ప్లాంటును జర్మనీ నియంత్రణ సంస్థ తనిఖీ చేపట్టింది. తదుపరి తనిఖీ పూర్తి అయి ఉత్తమ తయారీ విధానాలు (జీఎంపీ) అవలంబిస్తోందంటూ గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చే వరకు కంపెనీ వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement