స్వల్పంగా ధర తగ్గిన పసిడి

17 Feb, 2018 17:47 IST|Sakshi

సాక్షి,ముంబై:  బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు  స్వల్పంగా  తగ్గాయి.  అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం,  స్థానికంగా డిమాండ్‌ తగ్గడంతో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.  10 గ్రాముల పసిడి రూ. 70 రూపాయలు తగ్గి రూ. 31,750గా ఉంది. పెళ్లిళ్ల సీజన్‌ కారణంగా పెరిగిన  డిమాండ్‌తో రెండు మూడు రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధర  రూ.31,820 స్థాయికి  ర్యాలీ అయింది. శనివారం మార్కెట్‌ ముగిసే సమయానికి బంగారం స్వల్పంగా తగ్గి,   వెండి ధరలు పుంజుకున్నాయని  బులియన్  మార్కెట్ వర్గాలు తెలిపాయి.  కిలోవెండి రూ. 370 పెరిగి రూ. 39.750గా ఉంది. నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ రావడంతో వెండి ధర పెరిగిందని   పేర్కొన్నాయి.  ఎనిమిది గ్రాముల బంగారం ధర 24,800 రూపాయల వద్ద స్థిరపడింది. కాగా గత రెండు రోజుల్లో  పసిడి ధర  రూ .520 లాభపడింది. ప్రపంచవ్యాప్తంగా బంగారం 0.50 శాతం పడిపోయి 1,346.50 డాలర్లకు చేరుకుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు