దీపావళి నాటికి రూ. 24వేలకు బంగారం ధర | Sakshi
Sakshi News home page

దీపావళి నాటికి రూ. 24వేలకు బంగారం ధర

Published Fri, May 23 2014 12:21 PM

దీపావళి నాటికి రూ. 24వేలకు బంగారం ధర - Sakshi

హైదరాబాద్ : నిన్న మొన్నటి వరకూ చుక్కలు చూపిన బంగారం ధరలు క్రమంగా నేలచూపులు చూస్తున్నాయి. వారం రోజుల్లోనే బంగారం ధర పది గ్రాములకు 2వేల రూపాయలు తగ్గింది. దీపావళి పండుగ నాటికి పది గ్రాముల బంగారం ధర  24వేలకు దిగిరావచ్చని ఇండియన్ బులియన్ అండ్ జూయలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) తెలిపింది.

మరోవైపు  హైదరాబాద్ మార్కెట్లో  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,500  ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,600లుగా ఉంది. ఇక  కిలో వెండి ధర రూ. 41,250 వద్ద కొనసాగుతోంది. అలాగే రానున్న కాలంలో బంగారం ధరలు మరింతగా తగ్గుతాయని బులియన్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా పుత్తడికి డిమాండ్ తగ్గడం, ఇదే సమయంలో బంగారం ఉత్పత్తి పెరుగుతుండటంతో ఇప్పట్లో ధరలు పెరిగే అవకాశాలు కనిపించడం లేదని వారు అంటున్నారు. ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం సుంకాలు తగ్గిస్తే మరో 5 శాతం తగ్గుతుందని, అప్పుడు పది గ్రాముల బంగారం ధర రూ.25,000కి రావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.


 

Advertisement
Advertisement