బంగారం... 3 రోజుల్లో రూ.1,000 డౌన్ | Sakshi
Sakshi News home page

బంగారం... 3 రోజుల్లో రూ.1,000 డౌన్

Published Fri, Aug 28 2015 1:55 AM

బంగారం... 3 రోజుల్లో రూ.1,000 డౌన్ - Sakshi

ముంబై: అంతర్జాతీయ, దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ల బలహీన ధోరణి కారణంగా 24 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర వరుసగా మూడు రోజుల్లో దాదాపు రూ. 1,000 పడింది. ముంబై బులియన్ స్పాట్ మార్కెట్‌లో గురువారం పసిడి 24 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.205 తగ్గి రూ.26,390కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం కూడా అంతే స్థాయిలో తగ్గి, రూ.26,240కు పడింది.  వెండి విషయానికి వస్తే- కేజీ ధర రూ.330 నష్టపోయి రూ.34,715కు చేరింది.
 
క్రూడ్ అప్...: కాగా నెమైక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న  క్రూడ్ కాంట్రాక్ట్ బ్యారల్ ధర గురువారం తుది సమాచారం అందేసరికి 9 శాతం ఎగబాకి, 42 డాలర్లను తాకింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement