ఫియట్ తో గూగుల్ భాగస్వామ్యం అంతేనా..! | Sakshi
Sakshi News home page

ఫియట్ తో గూగుల్ భాగస్వామ్యం అంతేనా..!

Published Fri, May 20 2016 4:24 PM

Google Says No Plans to Expand Fiat Chrysler Self-Driving Car Partnership

ఫియట్ క్రిస్లర్ ఆటోమోబైల్స్ తో  సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల భాగస్వామ్యం కొనసాగించే ప్రణాళికలు ఇంకా తమ దగ్గర ఏమీ లేవని అల్ఫాబెట్ ఇంక్ గూగుల్ చెప్పింది. ఇంకా దీనిపై  ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీకి ఇతర సమర్థవంతులైన భాగస్వామ్య కంపెనీలతో చర్చిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల మొదట్లో 100 సెల్ఫ్ డ్రైవింగ్ మినీవ్యాన్స్ ను తయారుచేయడానికి గూగుల్ కు, ఫియట్ క్రిస్లర్ కు మధ్య ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందం ఫియాట్ క్రిస్లర్ తో సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ యాజమాన్యాన్ని షేర్ చేసుకోవడం కాదని, కేవలం 100 కార్ల తయారీ వరకేనని గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ క్రాఫ్సిక్ చెప్పారు.

ఈ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీతో కార్లను ఉత్పత్తిచేయడానికి తాము ఇంకా వివిధ ఆటోమేకర్స్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ఎప్పటినుంచి ప్రజలకు అందుబాటులోకి తేనుందో గూగుల్ ఇంకా వెల్లడించలేదు. 15లక్షల మైల్స్ వరకూ టెస్ట్ డ్రైవింగ్ నిర్వహించింది.  ఈ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికిల్స్ ను త్వరగా ప్రజల ముందుకు తీసుకురావడం తమ బాధ్యతని, ప్రస్తుతం హ్యుమన్ డ్రైవర్ల వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి ఈ సిస్టమ్ ను రూపుదిద్దామని క్రాఫ్సిక్ తెలిపారు. హ్యుమన్  డ్రైవర్ వల్ల జరిగే ప్రమాదాల్లో ఏడాదికి 33వేల మరణాలు సంభవిస్తుండగా, 23లక్షల మంది క్షతగాత్రులు పాలవుతున్నట్టు చెప్పారు.

Advertisement
Advertisement