ఈ-వాహనాలు తప్పనిసరి | Sakshi
Sakshi News home page

ఈ-వాహనాలు తప్పనిసరి

Published Sun, Mar 11 2018 5:16 PM

Government Departments, PSUs In NCR Asked To Switch To E-Vehicles - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రాజధాని పరిధిలోని అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలను సంప్రదాయ కార్లకు స్వస్తి పలికి ఎలక్ర్టానిక్‌ వాహనాలకు మళ్లాలని ఇంధన మంత్రిత్వ శాఖ కోరింది. 2030 నాటికి వాహన ట్రాఫిక్‌లో 30 శాతం బ్యాటరీలపై నడిచే వాహనాలు ఉండాలని భారత్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. పర్యావరణ అనుకూల ఎలక్ర్టికల్‌ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనే చర్యల్లో భాగంగా ఈ ప్రతిపాదన ముందుకొచ్చింది.

పలు మంత్రిత్వ శాఖలకు ఇంధన వనరుల మంత్రి ఆర్‌కే సింగ్‌ ఈ మేరకు లేఖ రాశారు. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఎలక్ర్టిక్‌ వాహనాలకు మళ్లాలని నిర్ణయించినట్టు లేఖలో పేర్కొన్నారు. తొలిదశలో జాతీయ రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ శాఖలు, పీఎస్‌యూల్లో ఎలక్ర్టిక్‌ వాహనాలను ప్రవేశపెడతారు. విద్యుత్‌ మంత్రిత్వ శాఖలోని పీఎస్‌యూలతో కలిసి పనిచేసే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎస్‌) ఇప్పటికే 10,000 ఎలక్ర్టిక్‌ వాహనాలకు ఆర్డర్‌ ఇచ్చింది. ఈ వాహనాలకు ఛార్జింగ్‌ సదుపాయాలను కూడా పలు ప్రాంతాల్లో నెలకొల్పనున్నట్టు లేఖలో ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Advertisement
Advertisement