పసిడి దిగుమతిపై 3 శాతం తగ్గిన టారిఫ్.. | Sakshi
Sakshi News home page

పసిడి దిగుమతిపై 3 శాతం తగ్గిన టారిఫ్..

Published Tue, Jun 2 2015 2:22 AM

పసిడి దిగుమతిపై 3 శాతం తగ్గిన టారిఫ్..

న్యూఢిల్లీ: అంతర్జాతీయ బలహీన ధోరణికి అనుగుణంగా కేంద్రం బంగారం దిగుమతి టారిఫ్ విలువను తగ్గించింది. 10 గ్రాములకు ఈ విలువను 398 డాలర్ల నుంచి 385 డాలర్లకు తగ్గించింది. అంటే దాదాపు 3 శాతం పైగా ఈ విలువ తగ్గింది. వెండి రేటు కూడా కేజీకి 567 డాలర్ల నుంచి 544 డాలర్లకు (4 శాతం) తగ్గింది. ఈ మేరకు ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కేంద్ర బోర్డ్ (సీబీఈసీ) ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎటువంటి లొసుగులకూ తావులేకుండా కస్టమ్స్ సుంకాన్ని విధించడానికి ‘టారిఫ్ విలువ’ ఒక బేస్‌రేటుగా ఉంటుంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా సాధారణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ టారిఫ్ విలువను కేంద్రం సవరిస్తుంటుంది. ఈ విలువ మార్పు 5 శాతంకన్నా ఎక్కువ ఉంటే... సహజంగా దేశీయ స్పాట్ మార్కెట్‌పై ఈ మార్పు ప్రభావం పడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement