ఎయిరిండియాలో 49% వాటా విక్రయానికి కసరత్తు | Sakshi
Sakshi News home page

ఎయిరిండియాలో 49% వాటా విక్రయానికి కసరత్తు

Published Thu, Mar 24 2016 12:58 AM

ఎయిరిండియాలో 49% వాటా విక్రయానికి కసరత్తు - Sakshi

న్యూఢిల్లీ: నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాలో 49 శాతం దాకా వాటాలను విక్రయించే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోంది. ఇందుకోసం నలుగురైదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కమిటీలో ఆర్థిక , పౌర విమానయాన శాఖల అధికారులతో పాటు క్యాబినెట్ సెక్రటేరియట్, కంపెనీ అధికారులు కూడా సభ్యులుగా ఉండనున్నారు. ఎయిరిండియా చిట్టచివరిసారిగా 2007లో లాభాలు చూసింది. అప్పట్నుంచీ ప్రైవేట్ కంపెనీల మార్కెట్ వాటా పెరుగుతుండగా.. సంస్థ వాటా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం మార్కెట్ వాటా ప్రకారం ఎయిరిండియా 3వ స్థానంలో ఉంది.

Advertisement
Advertisement