అధికారికంగా గ్రీస్ దివాలా.. | Sakshi
Sakshi News home page

అధికారికంగా గ్రీస్ దివాలా..

Published Sat, Jul 4 2015 12:45 AM

అధికారికంగా గ్రీస్ దివాలా.. - Sakshi

ఏథెన్స్: అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రీస్ అధికారికంగా దివాలా తీసినట్లు యూరోపియన్ ఆర్థిక స్థిరత్వ యంత్రాంగం (ఈఎఫ్‌ఎస్‌ఎఫ్) శుక్రవారం ప్రకటించింది. అయితే గ్రీస్‌కు ఇచ్చిన రుణాలను తక్షణమే చెల్లించాలంటూ డిమాండ్ చేయబోమని పేర్కొంది. మరో బెయిలవుట్ ప్యాకేజీ ఇచ్చేందుకు ఇతర యూరప్ దేశాలు పెడుతున్న షరతులను అంగీకరించాలా వద్దా అన్న అంశంపై గ్రీస్ ఆదివారం రెఫరెండం నిర్వహించనున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

వాస్తవానికి గత నెల 30న ఐఎంఎఫ్‌కు 1.7 బిలియన్ డాలర్లు చెల్లించలేకపోవడంతోనే గ్రీస్ అనధికారికంగా డిఫాల్ట్ అయినట్లయింది. దేశానికి ఆర్థిక తోడ్పాటు అందిస్తూ వస్తున్న ఈఎఫ్‌ఎస్‌ఎఫ్ తాజాగా దాన్నే అధికారికంగా ప్రకటించింది.  కాగా రెఫరెండంకి సంబంధించి నిర్వహించిన పోల్స్‌లో ... 44.8 శాతం మంది అనుకూలంగాను, 43.4 శాతం మంది వ్యతిరేకంగాను ఉన్నట్లు వెల్లడైంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement