కోటి రూపాయల పైగా తగ్గిన ఆ కారు ధర | Sakshi
Sakshi News home page

కోటి రూపాయల పైగా తగ్గిన ఆ కారు ధర

Published Sat, Jul 8 2017 11:34 AM

కోటి రూపాయల పైగా తగ్గిన ఆ కారు ధర

దేశమంతా ఒకే పన్ను విధానమంటూ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ మహిమతో దాదాపు అన్ని కార్ల ధరలు తగ్గిపోతున్నాయి. లగ్జరీ కారు తయారీదారులు కూడా తమ పాపులర్‌ మోడల్స్‌పై రేట్లను భారీగా తగ్గించేస్తున్నాయి. ప్రస్తుతం సూపర్‌ కారు తయారీదారులు రోడ్డు పన్నును రూ.20 లక్షల వరకు తగ్గించేశాయి. అంతర్గత రాష్ట్రాల పరిమితులతో ఇన్ని రోజులు కార్ల రిజిస్ట్రేషన్‌ కోసం ఎక్కువమొత్తంలో రోడ్డు పన్నులు చెల్లించేవారికి ఇది గుడ్‌న్యూస్‌గా మారింది. కొత్త జీఎస్టీ రేట్లు, అప్‌డేటెడ్‌ రోడ్డు పన్ను విధానంతో సూపర్‌ కార్లు చాలా చౌకగా మారుతున్నాయని తెలిసింది.  
 
సూపర్‌ కారు తయారీదారిలో ఒకటైన లంబోర్ఘిని దాదాపు కోటి రూపాయలకు పైగా ధరలను తగ్గించింది. ఒకవేళ తమ సూపర్‌ కారు అవెంటడర్‌ ఎస్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి రూ.1.05 కోట్ల వరకు తగ్గింపు పొందుతారని లంబోర్ఘిని పేర్కొంది. అయితే దీనిలో ఇన్సూరెన్స్‌ ధరలు కలుపలేదు. ఆస్టన్‌ మార్టిన్‌, ఫెరారీ, రోల్స్‌-రాయిస్ మోడల్స్‌, బెంట్లీ లాంటి మిగతా సూపర్‌ కార్లు, స్పోర్ట్స్‌ కార్ల తయారీదారులు కూడా కార్ల సంస్థలు కూడా త్వరలో ధరలు తగ్గింపును ప్రకటించనున్నాయి. 
 
ప్రస్తుతం లంబోర్ఘిని అవెంటడర్‌ ఎస్‌ ధర ఈ విధంగా ఉంది...
లంబోర్ఘిని అవెంటడర్‌ ఎస్‌             ప్రీ-జీఎస్టీ ధర                పోస్టు జీఎస్టీ ధర
ఎక్స్‌షోరూం ధర                         రూ.5.01 కోట్లు              రూ.5.01 కోట్లు
రోడ్డు పన్ను                               రూ.1 కోటి                   రూ.20 లక్షలు(క్యాప్‌ లిమిట్‌)
ఆక్ట్రాయ్‌                                   రూ.22.54 లక్షలు          నాట్‌-అప్లికేబుల్‌
ఆన్‌-రోడ్డు ధర                            రూ.6.23 కోట్లు              రూ.5.21 కోట్లు
(ఇన్సూరెన్స్‌ ముందు)

Advertisement
Advertisement