ఆర్థిక ఏకీకరణకు జీఎస్టీ దోహదం | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఏకీకరణకు జీఎస్టీ దోహదం

Published Tue, Mar 15 2016 12:07 AM

ఆర్థిక ఏకీకరణకు జీఎస్టీ  దోహదం - Sakshi

ఏడీబీ ప్రెసిడెంట్ తకిహికో నకయో
విదేశీ పెట్టుబడుల ఆకర్షణకూ కీలకమని సూచన

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ఏకీకరణకు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు దోహదపడుతుందని ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రెసిడెంట్ తకిహికో నకయో పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు సైతం ఈ విధానం తోడ్పడుతుందని ఆయన ఒక ఇంట ర్వ్యూలో పేర్కొన్నారు. పన్నుల వ్యవస్థ హేతుబద్ధీకరణ కోణంలో ఇది ఎంతో కీలకమని వివరించారు.  వ్యవసాయ రంగానికి సంబంధించి 2016-17 బడ్జెట్ ప్రతిపాదనలు బాగున్నాయన్నారు. మరిన్ని ఆర్థిక సంస్కరణలు, మౌలిక రంగ అభివృద్ధికి చర్యలు అవసరమని తెలిపారు. ముఖ్యంగా ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు కీలకమని తెలిపారు. 2016-17, 2017-18 సంవత్సరాల్లో సైతం 7 శాతం పైగా వృద్ధి నమోదవుతుందన్న అంచనాలను వ్యక్తం చేశారు.

ప్రస్తుతం మనం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం గురించి మాట్లాడుకుంటున్నామని, అయితే ప్రభుత్వం తనకుతానుగా పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకించి విద్య, ఆరోగ్య రంగాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.  సంస్కరణలు అవసరమైన మరో రంగం భూ సేకరణ విభాగంగా ఆయన పేర్కొన్నారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పన్ను ఆదాయ నిష్పత్తిని మరింతగా పెంచుకోవాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు.  ఇది కొంత క్లిష్టతతో కూడిన అంశమే అయినప్పటికీ, ఈ విషయంలో విజయం సాధించగలిగితే మౌలిక రంగంలో మరిన్ని పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement