నం.1 హైదరాబాద్‌ | Sakshi
Sakshi News home page

నం.1 హైదరాబాద్‌

Published Sat, Mar 17 2018 3:23 AM

Hyderabad is  the first in Dynamic Cities in 2018 - Sakshi

హైదరాబాద్‌: 2018 సంవత్సరానికి గాను ఆసియా ఫసిపిక్‌ రీజియన్‌లో డైనమిక్‌ నగరాల జాబితాలో హైదరాబాద్‌ తొలి స్థానంలో నిలిచింది. గతేడాది నం:1 స్థానంలో నిలిచిన బెంగళూరు ఈ ఏడాది రెండో స్థానానికి పడిపోయిందని ప్రముఖ రియల్టీ కన్సల్టెన్సీ జోన్స్‌ లాంగ్‌ లాసెల్లె (జేఎల్‌ఎల్‌) సిటీ మూమెంట్‌ ఇండెక్స్‌ (సీఎంఐ) పరిశోధన వెల్లడించింది. 2017లో హైదరాబాద్‌ది 5వ స్థానం. ఇక మన దేశంలోని ఇతర నగరాల ర్యాంకులు పరిశీలిస్తే.. పుణె 4వ స్థానం, కోల్‌కతా 5వ, ఢిల్లీ 8వ స్థానం, చెన్నై 14వ స్థానం, ముంబై 20వ స్థానంలో నిలిచాయి.

భవిష్యత్తు కేంద్ర నగరమిదే..
నగర జనాభా, ఆర్థిక స్థితి, ఎయిర్‌ కనెక్టివిటీ, కార్పొరేట్‌ కార్యాలయాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పారదర్శకతతో పాటూ నిర్మాణ రంగం, శోషణ, ధరలు, ఆఫీస్, రిటైల్, హోటల్స్‌ వంటి అంశాలపై పరిశోధన చేసింది. భవిష్యత్తులో ఉన్నత విద్యా వసతులు, ఆవిష్కరణల సామర్థ్యం, అంతర్జాతీయ పేటెంట్‌ దరఖాస్తులు, టెక్నాలజీ సంస్థలు, పర్యావరణ నాణ్యత, మౌలిక వసతులకు ఆయా నగరాలు కేంద్ర బిందువులవుతాయని వెల్లడించింది.   అందుబాటు గృహాలను నిర్మించాలంటే నగరంలో స్థలం కొరత. దీంతో శివారు ప్రాంతా లకు వెళ్లక తప్పని పరిస్థితి. అందుకే ముందుగా శివారుల్లో రహదారులు, మంచినీరు, విద్యుత్‌ వంటి మౌలికసదుపాయాలను కల్పించాలి.

Advertisement
Advertisement