జీఎస్‌టీ సెగ: 40వేల హోటల్స్ ‘బంద్‌’ | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ సెగ: 40వేల హోటల్స్ ‘బంద్‌’

Published Tue, May 30 2017 10:50 AM

జీఎస్‌టీ సెగ: 40వేల హోటల్స్ ‘బంద్‌’ - Sakshi

హైదరాబాద్‌ : జులై 1 నుంచి కేంద్ర  ప్రభుత్వం అమలు చేసేందుకు  కృషిచేస్తున్న జీఎస్‌టీ (గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌) పన్ను రేటులపై నిరసనల సెగలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హోటళ్లు మూతబడే దశకు చేరుకుంటా యని ఆందోళన వ్యక్తమవుతోంది.  మధ్య శ్రేణి హోటళ్ల నుంచి వసూలు చేసే 18 శాతానికి వ్యతిరేకంగా  దక్షిణాది రాషా్ట్రల హోటల్స్‌ అసోసియేషన్‌ బంద్‌కుపిలుపునిచ్చింది.  దీనికి తెలంగాణ హోటల్స్‌ అసోసియేషన్‌ మద్దతు పలికి  బంద్‌ లో పాల్గొంటోంది. దాదాపు 40 వేల హోటళ్ళు, రెస్టారెంట్లు మంగళవారం   బంద్‌ పాటిస్తున్నాయి. అయితే  స్టార్ హోటళ్లు బంద్‌కు  మద్దతు  ప్రకటించలేదు.

హోటళ్లపై పెను భారం మోపే విధంగా ఉన్న జీఎస్‌టీ  పన్ను రేటును తగ్గించి, స్టార్‌- నాన్‌స్టార్‌ హోటల్స్‌ ప్రాతిపదికన పన్ను రేటు నిర్ణయించాలని తెలంగాణ స్టేట్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జీఎస్‌టీ వల్ల సామాన్యులతో పాటు, ఆతిథ్య రంగం పెనుప్రభావానికి గురవుతుందని తెలిపారు. ఈ మేరకు దక్షిణాది హోటల్స్‌ అసోసియేషన్‌, తెలంగాణ స్టేట్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ‘జీఎస్‌టీ రేటు, హోటల్స్‌పై ప్రభావం’ అనే అంశంపై చర్చించారు. కేంద్ర నిర్ణయంతో తీవ్ర ప్రభావం పడుతున్నందునే హోటల్స్‌ బంద్‌కు మద్దతు ఇచ్చినట్టు వెంకట్‌రెడ్డి చెప్పారు. ఇతర దేశాలు పన్ను రేట్లు తగ్గించి పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేస్తుంటే ఇక్కడ మాత్రం పన్నులు పెంచి అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పునరాలోచించి హోటల్‌ రంగం చిన్నాభిన్నం కాకుండా కాపాడాలని కోరారు. హైదరాబాద్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి మాట్లాడుతూ సేవల రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న హోటల్స్‌ ప్రస్తుత జీఎస్‌టీని భరించలేవని, ఇదే కొనసాగిస్తే త్వరలో కుదేలవటం ఖాయమని అన్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని సుమారు 2 లక్షల హోటళ్ల సిబ్బంది బంద్‌లో పాల్గొంటారని దక్షిణాది  రాష్ట్రాల్లోల హోటళ్ల సంఘం ఉపాధ్యక్షుడు సోమరాజ్‌ తెలిపారు.
 

మరోవైపు ఒకటే దేశం ఒకటే పన్ను లక్ష్యంగా  కేంద్రం సర్కారు అమలు చేయనున్న  జీసీటీ   చట్టం  ప్రకారం  హోటల్స్‌ లో సర్వీస్‌ చార్జ్‌ తప్పనిసరికాదు.   వినియోగదారులకు ఫుడ్ స‌ర్వీస్ చేసినందుకు గాను   వివిధ హోటల్‌ యాజ‌మాన్యాలు  ముక్కుపిండి స‌ర్వీస్ చార్జ్ వ‌సూలు చేసేవి.  అయితే స‌ర్వీస్ చార్జ్ త‌ప్పని సరి కాద‌ని, ఇది  కస్టమర్ల ఇష్టంమీద ఆధారపడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు  ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను జారీ  చేసింది. దీంతో తెలంగాణా ప్రభుత్వం  కార్యాచరణలోకి దిగింది. తూనికలు కొలతల శాఖకు బాధ్యతలు అప్పగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా జిఎస్టి కౌన్సిల్  12 శాతం, 18 శాతం పన్ను స్లాబ్లను హోటళ్లలో, రెస్టారెంట్లలో నిర్ణయించింది. అయితే హోటళ్ళు, రెస్టారెంట్లు మాత్రం పరిశ్రమ పన్ను  యూనిఫాంగా 5 శాతంగా ఉండాలని కోరుతున్నాయి.

Advertisement
Advertisement