హ్యుందాయ్‌ ఎలక్ట్రిక్‌ కారు వచ్చేస్తోంది | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్‌ ఎలక్ట్రిక్‌ కారు వచ్చేస్తోంది

Published Thu, May 30 2019 5:50 AM

Hyundai, Kia looking to locally manufacture electric cars in India - Sakshi

గౌహతి: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘హ్యుందాయ్‌’ అతిత్వరలో తన సరికొత్త ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాన్ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ‘కోనా’ పేరుతో ఈ కారు జూలైలో విడుదలకు సిద్ధంగా ఉంది. చెన్నైలోని ఉత్పత్తి ప్లాంట్‌లో ఎలక్ట్రిక్‌ కారు అసెంబ్లింగ్‌ జరుగుతోందని ఇక్కడి అనుబంధ సంస్థ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) బుధవారం ఒక ప్రకటన చేసింది. ఈ అంశంపై మాట్లాడిన సంస్థ సీనియర్‌ జనరల్‌ మేనేజర్, గ్రూప్‌ హెడ్‌ (మార్కెటింగ్‌) పునీత్‌ ఆనంద్‌.. ‘భారత రోడ్లపై హ్యుందాయ్‌ ఎలక్ట్రిక్‌ కారు దూసుకురానుంది. మరోవైపు పండుగ సీజన్‌లో గ్రాండ్‌ ఐ10 నూతన మోడల్‌ను ప్రవేశపెట్టనున్నాం. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘వెన్యూ’ కారుకు 20,000 బుకింగ్స్‌ పూర్తయ్యాయి. ఈ కారు నిరీక్షణ కాలం 3–4 నెలలుగా ఉంది. చెన్నై ప్లాంట్‌లో నెలకు 7,000 వెన్యూ కార్ల ఉత్పత్తి జరుగుతుండగా.. దీనిని 10,000కు పెంచనున్నాం’ అని చెప్పారు.

Advertisement
Advertisement