రుణ రేటును స్వల్పంగా తగ్గించిన ఐసీఐసీఐ | Sakshi
Sakshi News home page

రుణ రేటును స్వల్పంగా తగ్గించిన ఐసీఐసీఐ

Published Thu, Jun 2 2016 12:52 AM

రుణ రేటును స్వల్పంగా తగ్గించిన ఐసీఐసీఐ - Sakshi

ముంబై: మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్‌ఆర్) ఐసీఐసీఐ బ్యాంక్ బుధవారం స్వల్పంగా 0.05 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లకు సరిసమానమయ్యింది.  బ్యాంక్ కొత్త రుణ గ్రహీతలకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూర్చుతుంది. తాజా తగ్గింపు ప్రకారం బ్యాంక్ ఓవర్‌నైట్ రుణ రేటు 8.95 శాతంగా ఉంటుంది. గృహ రుణాలకు అనుసంధానమైన ఏడాది రేటు 9.15 శాతానికి తగ్గుతుంది. నెల, మూడు నెలలు, ఆరు నెలల రుణ రేట్లకు కూడా మార్చిన రేటు వర్తిస్తుంది. మారిన రేట్లు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి.

 మరికొన్ని బ్యాంకులూ: ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరాబ్యాంక్‌సహా మరికొన్ని బ్యాంకులు కూడా జూన్‌కు సంబంధించి ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రుణ రేటును సమీక్షించాయి. ఏడాది రుణ రేటు విషయంలో ఎస్‌బీఐ (9.15%), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (9.40%) ఎటువంటి మార్పూ చేయలేదు. కెనరా బ్యాంక్ రేటు 0.10% తగ్గి 9.35 శాతానికి చేరింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, జైపూర్ రుణ రేటు 0.15 శాతం తగ్గి 9.55 శాతానికి చేరింది. తాజా రేటు తక్షణం అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.

Advertisement
Advertisement