ఐడీబీఐ బ్యాంక్‌ నష్టాలు 1,524 కోట్లు  | Sakshi
Sakshi News home page

ఐడీబీఐ బ్యాంక్‌ నష్టాలు 1,524 కోట్లు 

Published Thu, Feb 1 2018 1:23 AM

IDBI Bank has reported a loss of Rs 1,524 crore - Sakshi

ముంబై: ఐడీబీఐ బ్యాంక్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,524 కోట్ల నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.2,255 కోట్ల నికర నష్టాలు వచ్చాయని, మొండి బకాయిలకు కేటాయింపులు పెరిగినా, ఈ క్యూ3లో నష్టాలు తగ్గాయని  ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.7,104 కోట్ల నుంచి రూ.6,645 కోట్లకు తగ్గిందని పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.3,135కోట్ల నుంచి రూ.3,649 కోట్లకు పెరిగాయని, దీంతో మొత్తం కేటాయింపులు రూ.3,205 కోట్ల నుంచి రూ.4,179 కోట్లకు చేరాయని వివరించింది.  

పెరిగిన మొండి బకాయిలు: గత క్యూ3లో రూ.35,245 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో రూ.50,621 కోట్లకు పెరిగాయని, అలాగే నికర మొండి బకాయిలు రూ.20,949 కోట్ల నుంచి రూ.29,352 కోట్లకు ఎగిశాయని వివరించింది. శాతం పరంగా చూస్తే స్థూల మొండి బకాయిలు 15.16 శాతం నుంచి 24.72 శాతానికి, నికర మొండి బకాయిలు 9.61 శాతం నుంచి 16.02 శాతానికి పెరిగాయని పేర్కొంది. మొండి బకాయిల రద్దు రూ.778 కోట్ల నుంచి ఐదు రెట్లు పెరిగి రూ.4,214 కోట్లకు చేరిందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐడీబీఐ బ్యాంక్‌ షేర్‌ 1% నష్టంతో రూ.60 వద్ద ముగిసింది.    

Advertisement
Advertisement