బ్రిక్స్.. ప్రపంచ బ్యాంక్‌కు ప్రత్యామ్నాయం కాదు | Sakshi
Sakshi News home page

బ్రిక్స్.. ప్రపంచ బ్యాంక్‌కు ప్రత్యామ్నాయం కాదు

Published Tue, Mar 17 2015 1:14 AM

బ్రిక్స్.. ప్రపంచ బ్యాంక్‌కు ప్రత్యామ్నాయం కాదు

బ్రిక్స్ అబ్జర్వర్ రీసెర్చ్ నిపుణులు విశ్వనాధన్
విశాఖపట్నం: బ్రిక్స్ దేశాలు ఏర్పాటుచేయనున్న బ్యాంక్,  ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)లకు ప్రత్యామ్నాయం కాదని, ఆదృష్టితో చూడకూడదని బ్రిక్స్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిపుణుడు, మాజీ రాయబారి హెచ్.హెచ్.ఎస్ విశ్వనాధన్ తెలిపారు. బ్రిక్స్ నూతన ఆర్ధిక అంతర్జాతీయ సదస్సును గీతం వర్సిటీలో సోమవారం నిర్వహించారు.

ఈ సదస్సులో బ్రెజిల్, రష్యా, భారత్, ఛైనా, సౌత్ ఆఫ్రికా దేశాల (బ్రిక్స్ దేశాలు) నుంచి ప్రతినిధులు పాల్గొని ఆయా దేశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాణిజ్య సంబంధాల మెరుగు పడటానికి బ్రిక్స్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా విశ్వనాధన్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల ప్రమేయం లేకుండా బ్రిక్స్ భవిష్యత్తులో ప్రపంచ ఆర్ధిక శక్తిగా ఎదగలేదన్నారు. భారత మాజీ రాయబారి అమిత్ గుప్తా మాట్లాడుతూ వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ తదితర అంశాలపై బ్రిక్స్ ప్రపంచంలో ఇతర దేశాలకు మార్గదర్శకం వహించాలన్నారు.

దక్షిణాఫ్రికా హైకమిషన్ కార్యాలయం కార్యదర్శి శ్రీధరన్ ఎస్.పిళ్లై, చైనా రాయబారి కార్యాలయం డిప్యూటీ మినిస్టర్ కౌన్సిల ర్ జెన్ నియో మాట్లాడుతూ బ్రిక్స్ కూటమి టైజం, పైరసీ, ఆరోగ్య రంగం తదిర సామాజిక అంశాలపై దృష్టి సారించాలన్నారు. గీతం అధ్యక్షుడు ఎం.వి.వి.ఎస్ మూర్తి మాట్లాడుతూ బ్రిక్స్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ద్వారా ఎగుమతులు పెరిగే అవకాశం ఉందన్నారు.

Advertisement
Advertisement