ఫేస్బుక్ లో సీపీఎల్ లైవ్ | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్ లో సీపీఎల్ లైవ్

Published Thu, Jun 30 2016 2:15 PM

ఫేస్బుక్ లో సీపీఎల్  లైవ్

క్రికెట్ అభిమానులకు ఇక పండగే. మొట్టమొదటిసారి హీరో కరీబియన్ ప్రీమియం లీగ్(సీపీఎల్) మ్యాచ్ లను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లైవ్ గా ప్రసారం చేయబోతోంది. కంపెనీ ప్రముఖ ప్రొడక్ట్ ఫీచర్ ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఈ మ్యాచ్ లను ప్రసారం చేసేందుకు బ్రాడ్ కాస్టింగ్ డీల్ కుదుర్చుకుంది.  ట్వంటీ 20 టోర్నమెంట్ లో జరగబోయే 34 మ్యాచ్ లను భారత్ తో పాటు 40 దేశాల్లో ఫేస్ బుక్ లైవ్ ద్వారా ప్రసారం చేయబోతున్నామని క్రికెట్ లీగ్ గురువారం వెల్లడించింది. ఫేస్ బుక్ లైవ్ ప్లాట్ ఫామ్ తో 40 దేశాల్లో ప్రసారం చేసే మొట్టమొదటి స్పోర్ట్ లీగ్ సీపీఎల్ మాత్రమేనని, పాకిస్తాన్, దక్షిణ ఆఫ్రికా, ఫిలిప్పీన్స్ దేశాల్లో కూడా ఈ లైవ్ ను వీక్షించవచ్చని సీపీఎల్ ప్రకటించింది. ఫేస్ బుక్ లైవ్ తో అందించే మొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా ఇదేనని పేర్కొంది.

ఈ బ్రాండ్ కాస్టింగ్ తో సీపీఎల్ ను విస్తరించుకుని అంతర్జాతీయ ప్రేక్షకులను పెంచకుంటామని సీపీఎల్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ పీట్ రస్సెల్ పేర్కొన్నారు. 2015లో 930లక్షల ప్రపంచ వీక్షకులను సంపాదించిందని, వచ్చే టోర్నమెంట్ తో వీక్షకులను మరింత పెంచుతామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. దీంతో అంతర్జాతీయంగా ఎక్కువ ఫాలోవర్స్ ను సంపాదిస్తామని పేర్కొన్నారు. క్రికెట్ అభిమానులకు ఈ లైవ్ తో క్రికెట్ ప్రసారాలను అందించడమే కాకుండా.. పేవరెట్ స్టార్లను కనెక్ట్ అయ్యేలా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆరు టీమ్ లతో బుధవారం నుంచి ఈ లీగ్ ప్రారంభమైంది. క్రిస్ గేల్, ఏబీ డీ విలియర్స్, కుమార్ సంగక్కర, డేల్ స్టెయిన్, డ్వేన్ బ్రేవో, కీరాన్ పోలార్డ్, బ్రెండన్ మెక్కలమ్ ఇతర క్రికెటర్లు ఈ మ్యాచ్ లో పాల్గొంటున్నారు. మొబైల్ వీడియో, అడ్వర్ టైజింగ్ కంపెనీ గ్రేబ్యో ద్వారా ఈ లైవ్ ను ఫేస్ బుక్ బ్రాండ్ కాస్ట్ చేస్తుంది.
 

Advertisement
Advertisement