Sakshi News home page

స్టాక్ మార్కెట్లో... రిస్క్‌తో పాటు అధిక రాబడులు

Published Mon, Feb 1 2016 1:25 AM

In addition to the high-risk and returns in the stock market

సాక్షి, హన్మకొండ: స్టాక్ మార్కెట్‌లో రిస్క్‌తో పాటు రాబడులు అధికంగా ఉంటాయని, అం దువల్ల అధిక రాబడుల కోసం షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్‌ఎల్) రీజనల్ మేనేజర్ వెనిశెట్టి శివప్రసాద్ అన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్, సీడీఎస్‌ఎల్ సహకారంతో సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండలో మదుపరుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడుల్లో రిస్క్ ఉందని, ప్రతీ వ్యక్తి తన వయసు ఆధారంగా రిస్క్ తీసుకోవాలని సూచించారు.

తక్కువ వయసున్న వారు ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చన్నారు.  షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలంటే నిత్యం మార్కెట్ పోకడలను గమనిస్తూ ఉండాలని హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్స్, విజయవాడ బ్రాంచ్‌మేనేజర్ పద్మనాభముని అన్నారు. అదేవిధంగా  షేర్ల క్రయవిక్రయాల్లో సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోవడం కీలకమన్నారు. కంపెనీ వ్యాపారం, నిర్వహణ సామర్థ్యం, మార్కెట్ వ్యాల్యూ ( బిజినెస్, మేనేజ్‌మెంట్) వంటి చెక్‌పాయింట్ల ఆధారంగా షేర్లను కొనుగోలు చేయాలని హెచ్‌డీఎఫ్‌సీ సౌత్ రీజనల్ హెడ్, డీవీ సునీల్‌రెడ్డి సూచించారు.

సదస్సులో స్టాక్ మార్కెట్‌కు సంబంధించి డీ మ్యాట్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్స్ తదితర అంశాల గురించి ఔత్సాహిక మదుపరులకు నిపుణులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. సదస్సుకు వచ్చిన మదుపుదారులు పలు సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement