రెస్టారెంట్లు, హోటళ్లకు కేంద్రం వార్నింగ్‌

13 Sep, 2017 19:16 IST|Sakshi
రెస్టారెంట్లు, హోటళ్లకు కేంద్రం వార్నింగ్‌
సాక్షి, న్యూఢిల్లీ : హోటళ్లు, రెస్టారెంట్లు ఎడాపెడా వాయించే సర్వీసు ఛార్జీలను తప్పనిసరిగా కాదని కేంద్రం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రెస్టారెంట్లు, హోటళ్లు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. సర్వీస్‌ ఛార్జీలను వసూలు చేస్తూనే ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. సర్వీసు ఛార్జ్‌ను ఆదాయంగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రప్రత్యక్ష పన్నుల బోర్డును ఆదేశించింది. వీటిపై పన్ను వసూలు చేయాలంటూ సీబీడీటీకి పేర్కొంది. సర్వీసు ఛార్జ్‌లను వసూలు చేస్తే.. వాటిపై కూడా పన్ను చెల్లించాలంటూ రెస్టారెంట్లను సైతం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.
 
రెస్టారెంట్లలో సర్వీస్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు హెల్ప్‌లైన్‌, మీడియా ద్వారా ఫిర్యాదులు వచ్చాయని పాశ్వాన్‌ ట్వీట్‌ చేశారు. ఇకపై రెస్టారెంట్ల నుంచి పన్నులు తీసుకుంటున్నప్పుడు అందులో సర్వీస్‌ ఛార్జీని కూడా కలపాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డును ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో జారీచేసిన గైడ్‌లైన్స్‌ ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లలో వసూలు చేసే సర్వీసు ఛార్జ్‌లు తప్పనిసరి కాదని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది ఒక ఆప్షనల్‌ మాత్రమేనని పేర్కొంది. కానీ తమకందిన ఫిర్యాదుల్లో ఈ ఛార్జీలను బలవంతంగా వసూలు చేస్తున్నట్టు తెలిసిందని పాశ్వాన్‌ చెప్పారు.  
 
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నష్టాల్లోకి జారుకున్న స్టాక్‌మార్కెట్లు

ఫార్చూన్‌ 500లో షావోమి

జీవితకాల గరిష్టస్థాయికి పసిడి

పేమెంట్‌ బ్యాంకులు... ప్చ్‌!

64 ఎంపీ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌

బజాజ్‌ ఆటో కొత్త బైక్‌ : రూ.38 వేలు 

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభంలో 18% వృద్ధి

డైరెక్ట్‌ ప్లానా? రెగ్యులర్‌ ప్లానా?

రూ.18,000 కోట్ల సమీకరణకు యాక్సిస్‌ బ్యాంకు నిర్ణయం

ఈసారి ద్రవ్యోల్బణం 4.1 శాతం

ఏ పరిస్థితులకైనా అనువైన ఫండ్‌

విద్యా రుణానికి మెరుగైన మార్గం

ప్రమోషన్లు, కొత్త నియామకాలు నిలిపివేత

అమ్మకాల  సెగ : భారీ నష్టాలు

ఈ ప్రోత్సహకాలు లాభాన్నిచ్చేవే..!

జొమాటో, స్విగ్గీ పోటా పోటీ

ముకేశ్‌ అంబానీ వేతనం ఎంతంటే..

డాబర్‌ ఇండియాకు కొత్త చైర్మన్‌

‘సోలార్‌’.. కేరాఫ్‌ ప్రాకృతిక్‌ పవర్‌!

షావొమీ ‘గోల్డ్‌’ ఫోన్‌ @ 4.8 లక్షలు

ఫుట్‌బాల్‌ టికెట్లు, వాచీలు..!

ధనాధన్‌ రిలయన్స్‌!

ఇన్వెస్టెర్రర్‌ 2.0

ఆర్‌ఐఎల్‌ ప్రోత్సాహకర ఫలితాలు

ఆర్‌బీఎల్‌ ఫలితాలు భేష్‌..షేరు క్రాష్‌

530 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్లు 

సుజుకీ ‘జిక్సర్‌’ కొత్త వెర్షన్‌

ఎయిర్‌టెల్‌కు మరోసారి జియో షాక్‌

పేటీఎమ్‌ మాల్‌లో ఈబే చేతికి 5.5% వాటా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?