భారత్‌ పెద్ద వాణిజ్య కేంద్రం | Sakshi
Sakshi News home page

భారత్‌ పెద్ద వాణిజ్య కేంద్రం

Published Thu, Feb 23 2017 1:19 AM

భారత్‌ పెద్ద వాణిజ్య కేంద్రం

డెన్మార్క్‌ రాయబారి పీటర్‌ టక్సో జెన్సన్‌
సాక్షి, హైదరాబాద్‌: వాణిజ్య రంగానికి భారతదేశం అనువైన ప్రదేశమని, ఇక్కడి ఆర్థిక వ్యవస్థ ఎంతో బాగుందని డెన్మార్క్‌ రాయబారి పీటర్‌ టక్సో జెన్సన్‌ పేర్కొన్నారు. డెన్మార్క్‌కు చెందిన మెరైన్, ఆఫ్‌షోర్, ఇండస్ట్రీస్, ఆయిల్‌ స్పిల్‌ ఉపకరణాలు, రక్షణ, ఇంధన యుటిలిటీ విభాగంలో పంప్‌ సొల్యూషన్స్‌ అభివృద్ధిలో ప్రత్యేకత కలిగిన డెస్మీ భారత్‌లో తన మొదటి తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. బుధవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంట్నం మండలం ఆదిబట్ల ఐటీ సెజ్‌లో 4 ఏకరాల విస్తీర్ణంలో డెన్మార్క్‌ రాయబారి పీటర్‌ టక్సో జెన్సన్, తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ  ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌లు ప్లాంట్‌ను ప్రారంభించారు.

ఈ  సందర్భంగా పీటర్‌ టక్సో జెన్సన్‌ మాట్లాడుతూ దేశంలో సంస్థ ఉనికి పటిష్టం చోసుకోవాలనే లక్ష్యంతో రూ.15 కోట్ల పెట్టుబడులతో ప్లాంటు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్‌ వాణిజ్య రంగానికి పేరుగాంచిందని తెలిపారు. కార్యక్రమంలో డెస్మీ గ్రూప్‌ సీఈఓ హెర్నిక్‌ సొరెన్‌సేన్, డెస్మీ ఇండియా ఎల్‌ఎల్‌పీ చైర్మన్‌ జాన్‌ తారఫ్, డెస్మీ ఇండియా ఎల్‌ఎల్‌పీ ఎండీ ఏవీఎస్‌ మూర్తి పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement