వేగంగా వృద్ధి చెందుతున్నా..ఎన్నెన్నో వెనుకడుగులు! | Sakshi
Sakshi News home page

వేగంగా వృద్ధి చెందుతున్నా..ఎన్నెన్నో వెనుకడుగులు!

Published Fri, Jul 15 2016 1:29 AM

వేగంగా వృద్ధి చెందుతున్నా..ఎన్నెన్నో వెనుకడుగులు!

భారత్‌పై ఐరాస మానవ వనరుల నివేదిక

 న్యూఢిల్లీ: దక్షిణాసియాలోని పలు ఇరుగుపొరుగు దేశాలతో పోల్చితే పలు ఆర్థిక, సామాజిక రంగాల్లో భారత్ వెనుకబడి ఉందని ఐక్యరాజ్య సమితి రూపొందించిన 2015 మానవ అభివృద్ధి నివేదిక ఒకటి  తెలిపింది. నివేదిక దక్షిణ ఆసియాలో ఇరాన్‌ను కూడా కలిపింది. 2005-2014 మధ్య వివిధ అంతర్జాతీయ సంస్థలు సేకరించిన సమాచారం ప్రాతిపదికన ఈ నివేదిక రూపొందింది.  దీని ప్రకారం చూస్తే...

  2013లో భారత్ తలసరి ఆదాయం 5,238 డాలర్లు. ఇది ఇరాన్‌లో పోల్చితే 65% తక్కువ. మాల్దీవులతో (11,238 డాలర్లు) పోల్చిచూస్తే 54% తక్కువ. శ్రీలంకతో (9,426 డాలర్లు)తో పోల్చి చూసినా 44% తక్కువ. భూటాన్‌తో పోల్చితే 27% (7,167 డాలర్లు) తక్కువ.

  2002-2012 లెక్క ప్రకారం రోజుకు 1.25 డాలర్ల కొనుగోలు శక్తి సామీప్యత (పీపీపీ) ప్రాతిపదికన దారిద్య్ర రేఖ దిగువన ఉన్న  ప్రజల సంఖ్య భూటాన్‌లో 2.4%. మాల్దీవుల్లో 6.3%. పాకిస్తాన్‌లో 12.7%. భారత్‌లో 23.6%. నేపాల్‌లో 23.7%. 43.3%తో బంగ్లాదేశ్ అట్టడుగున ఉంది. కాగా 2015 అక్టోబర్‌లో ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ‘ఇండియా స్పెండ్ రిపోర్ట్’ ప్రకారం, 2011-12లో 21 %గా ఉన్న భారత్ పేదరికం రేటు..ఇప్పుడు 12.4%కి తగ్గింది.

Advertisement
Advertisement