ఐసీటీ సర్వీసులఎగుమతుల్లో భారత్‌ టాప్‌ | Sakshi
Sakshi News home page

ఐసీటీ సర్వీసులఎగుమతుల్లో భారత్‌ టాప్‌

Published Sat, Jun 17 2017 1:26 AM

ఐసీటీ సర్వీసులఎగుమతుల్లో భారత్‌ టాప్‌

ఐక్యరాజ్యసమితి: ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) సర్వీసుల  ఎగుమతుల్లో భారత్‌ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం.. భారత్‌ చాలా అంశాల్లో మెరుగైన ప్రదర్శన కనబరచింది. అలాగే మరికొన్ని వాటిల్లో అంత మంచి ర్యాంక్‌లను సాధించలేకపోయింది.

గ్రాడ్యుయేట్స్‌ ఇన్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ కేటగిరిలో 10వ స్థానాన్ని, ఇ–పార్టిసిపేషన్‌లో 27వ స్థానాన్ని, గ్లోబల్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీస్‌లో 14వ స్థానాన్ని, గవర్నమెంట్‌ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌లో 33వ స్థానాన్ని, జనరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 32వ స్థానాన్ని, సృజనాత్మక వస్తువుల ఎగుమతుల్లో 18వ స్థానాన్ని, ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ పేమెంట్స్‌లో 29వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఇండియా కొన్ని అంశాల్లో అంతగా మెప్పించలేకపోయింది. రాజకీయ స్థిరత్వం, భద్రతలో 106వ స్థానంలో ఉంది. వ్యాపార పరిస్థితుల్లో 121వ స్థానంలో, ఎడ్యుకేషన్‌లో 114వ స్థానంలో నిలిచింది.

Advertisement
Advertisement