ఫేస్‌బుక్ నియంత్రణలో భారత్ టాప్ | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ నియంత్రణలో భారత్ టాప్

Published Thu, Nov 6 2014 12:37 AM

ఫేస్‌బుక్ నియంత్రణలో భారత్ టాప్ - Sakshi

న్యూఢిల్లీ: సోషల్ నెట్‌వర్కింగ్ సైటు ఫేస్‌బుక్‌లోని కంటెంట్‌ను అత్యధికంగా నియంత్రిస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. భారత ప్రభుత్వ సూచన మేరకు ఈ ఏడాది ప్రథమార్ధంలో దాదాపు 5,000 అంశాలకు సంబంధించిన సమాచారంపై ఫేస్‌బుక్ ఆంక్షలు విధించింది. సోషల్ మీడియాలో విద్వేషపూరిత కంటెంట్‌ను నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం, భద్రతా ఏజెన్సీల ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఒక నివేదికలో ఫేస్‌బుక్ పేర్కొంది.

మతాలు, ప్రభుత్వాలను విమర్శించే విధమైన కంటెంట్‌పై భారత చట్టాల ప్రకారం నిషేధం ఉన్నట్లు వివరించింది. ఇక అత్యధికంగా ఆంక్షల విజ్ఞప్తులు చేసిన దేశాల్లో టర్కీ (1,893), పాకిస్థాన్ (1,773) ఉన్నాయి. మరోవైపు, అత్యధిక సంఖ్యలో యూజర్లు, వారి అకౌంట్లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ కోరిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలోనూ, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. భారత ప్రభుత్వం నుంచి జనవరి-జూన్ 2014 మధ్య కాలంలో 5,958 మంది యూజర్లు, వారి అకౌంట్ల వివరాలు ఇవ్వాలంటూ 4,559 విజ్ఞప్తులు వచ్చినట్లు ఫేస్‌బుక్ తన నివేదికలో వెల్లడించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement