గూగుల్ క్లౌడ్ సేవల్లో భారత్ కీలకం | Sakshi
Sakshi News home page

గూగుల్ క్లౌడ్ సేవల్లో భారత్ కీలకం

Published Fri, Mar 25 2016 12:47 AM

గూగుల్ క్లౌడ్ సేవల్లో భారత్ కీలకం

శాన్‌ఫ్రాన్సిస్కో: అంతర్జాతీయంగా తమ ఎంటర్‌ప్రైజెస్ క్లౌడ్ సేవల వ్యూహాలకు సంబంధించి భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తెలిపింది. భారత్‌లో పెద్ద ఎత్తున వస్తున్న సంస్థలకు తమ సేవలను అందుబాటులోకి తేవడంపై దృష్టి సారిస్తున్నట్లు సంస్థ క్లౌడ్ సర్వీసుల విభాగం చీఫ్ డయాన్ గ్రీన్ తెలిపారు. భారతీయ కంపెనీలకు ఉపయోగకరంగా ఉండే సాధనాల రూపకల్పనపై గూగుల్ భారీగా ఇన్వెస్ట్ చేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఇవి అత్యంత వేగవంతంగా పనిచేసేలా, అందుబాటు ధరలో లభ్యమయ్యేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గూగుల్ క్లౌడ్ ప్రోడక్ట్స్ (జీసీపీ) నెక్ట్స్ 2016 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, తాము ఇప్పటిదాకా తీర్చిదిద్దిన ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ వ్యాపార సంస్థకు అందుబాటులోకి తేవడంపై దృష్టి సారిస్తున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివరించారు.

Advertisement
Advertisement