నీరసంగా ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్చేంజ్‌ లిస్టింగ్‌ | Sakshi
Sakshi News home page

నీరసంగా ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్చేంజ్‌ లిస్టింగ్‌

Published Tue, Oct 24 2017 12:47 AM

Indian Energy Exchange Listing dull

న్యూఢిల్లీ: ఇండియన్‌ ఎనర్జీ ఎక్సే్చంజ్‌ (ఐఈఎక్స్‌) షేర్లు సోమవారం స్టాక్‌మార్కెట్లో పేలవంగా లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ.1,650 తో పోల్చితే ఈ షేర్‌ 9 శాతం నష్టంతో రూ.1,500 వద్ద లిస్టయింది. చివరకు 1.4 శాతం నష్టంతో రూ.1,626 వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈలో 1.2 శాతం నష్టంతో రూ.1,626 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈలో 6 లక్షలకు పైగా, ఎన్‌ఎస్‌ఈలో 33 లక్షలకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.4,933 కోట్లుగా నమోదైంది. ఈ నెల 9న ప్రారంభమై 11న ముగిసిన ఐపీఓ ద్వారా ఐఈఎక్స్‌ కంపెనీ రూ.1,001 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓ 2.23 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రై బయింది. యాక్సిస్‌ క్యాపిటల్, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించాయి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement