రూపాయి పతన బాటలోనే... | Sakshi
Sakshi News home page

రూపాయి పతన బాటలోనే...

Published Tue, Nov 29 2016 12:27 AM

రూపాయి పతన బాటలోనే... - Sakshi

30 పైసలు క్షీణించి 68.76 వద్ద ముగింపు
ఈ ఏడాది  కనిష్ట స్థాయి ఇది...

ముంబై: విదేశీ  పెట్టుబడులు తరలిపోతుండడం కొనసాగుతుండడంతో సెంటిమెంట్  దెబ్బతిని రూపాయి క్షీణించింది. సోమవారం డాలర్‌తో రూపాయి మారకం 30 పైసలు క్షీణించి 68.76 వద్ద ముగిసింది.

 తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు
కంపెనీల నుంచి డాలర్‌కు డిమాండ్ బాగా ఉండడం, కరెన్సీ ఒడిదుడుకుల నేపథ్యంలో దిగుమతిదారుల హెడ్జింగ్  వ్యూహాలు రూపాయిపై తీవ్రమైన ఒత్తిడిని చూపుతున్నాయని నిపుణులంటున్నారు. రూపాయి నిలకడ కోసం ఆర్‌బీఐ చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచనున్నదన్న అంచనాలు, డాలర్ బలపడుతుండటంతో విదేశీ నిధులు తరలిపోతున్నారుు. ఇది రూపీ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోందని ఫారెక్స్  డీలర్లు పేర్కొన్నారు. ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్(ఎఫ్‌సీఎన్‌ఆర్) డిపాజిట్లపై కొనసాగుతున్న రిడంప్షన్ ఒత్తిడి రూపారుు ఇబ్బందులను మరింత అధ్వానం చేసిందని వారంటున్నారు.

 లాభాల్లోంచి నష్టాల్లోకి..: ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపారుు మారకం శుక్రవారం ముగింపు(68.46)తో పోల్చితే సోమవారం 68.42 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అరుుతే ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోరుుంది. ఇంట్రాడేలో 68.80 కనిష్ట స్థారుుని తాకి చివరకు 30 పైసల (0.44 శాతం) నష్టంతో 68.76 వద్ద ముగిసింది. గత గురువారం నాడు ఇంట్రాడేలో రూపారుు 68.86ను తాకింది. ఇది రికార్డ్ కనిష్ట స్థారుు. ఆరోజు రూపాయి 68.74 వద్ద ముగిసింది. ఇది 39 నెలల కనిష్ట స్థారుు. 2013, ఆగస్టు 28న డాలర్‌తో రూపాయి మారకం 68.80 వద్ద ముగిసింది. ఇదే రికార్డ్ కనిష్ట స్థారుు. బాండ్ల కొనుగోళ్ల జోరుకు కళ్లెం వేయాలన్న ఆలోచనతో రేట్లను పెంచనున్నామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలివ్వడంతో ఆ రోజు రూపాయి ఈ స్థారుులో పతనమైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే రూపాయి 3.95శాతం నష్టపోరుుంది.

Advertisement
Advertisement