ఓటుకు నోటు తోడు 'బేర్' బజార్ | Sakshi
Sakshi News home page

ఓటుకు నోటు తోడు 'బేర్' బజార్

Published Thu, Nov 10 2016 1:10 AM

ఓటుకు నోటు తోడు 'బేర్' బజార్ - Sakshi

పెద్ద నోట్ల రద్దు.. ట్రంప్ విక్టరీతో అతలాకుతలం
సెన్సెక్స్ 1,689 పాయింట్ల పతనం.. చివర్లో తగ్గిన నష్టాలు
500పాయింట్ల పతనం నుంచి కోలుకున్న నిఫ్టీ
దూసుకెళ్లిన బంగారం.. మరింత పెరిగే చాన్స్...

మంగళవారం రాత్రి బ్లాక్‌మనీపై ప్రధాని మోదీ వేసిన బాంబు ఒకవైపు!!. ఊహించని ట్రంప్ విజయం మరోవైపు!! మార్కెట్లకు రెండూ మింగుడు పడని వార్తలే. దీంతో ఆరంభమయ్యేవరకూ ఉత్కంఠే. ఆరంభంలో విపరీతమైన అమ్మకాలు... ఊహించని పతనం. సెన్సెక్స్, నిఫ్టీ వంటి సూచీలు ఏకంగా ఆరు శాతానికి పైగా పడిపోయారుు. మరోవైపు... ఇలాంటి సమయాల్లో సురక్షితమైన సాధనంగా జనం భావించే బంగారం సర్రుమని ఎగబాకింది. డాలరుతో పోలిస్తే కొన్ని దేశాల కరెన్సీలు కుదేలైపోగా... రూపారుు మాత్రం కాస్త గట్టిగానే నిలిచింది. ఇదీ... బుధవారం స్టాక్, కమోడిటీ, కరెన్సీ మార్కెట్ల తీరు.

నిమిషాల్లో 6 లక్షల కోట్లు ఆవిరి..
ట్రేడింగ్ తొలిదశలో సంభవించిన భారీ పతనంతో నిముషాల్లో రూ. 6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోరుుంది. బీఎస్‌ఇ లిస్టరుున షేర్ల మార్కెట్ విలువ పడిపోవడంతో వచ్చిన ఇన్వెస్టర్ల పుస్తక నష్టాలు చివరకు రూ. 2 లక్షల కోట్లకు పరిమితయ్యారుు. క్రితం రోజు బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 111.44 లక్షల కోట్లుకాగా, బుధవారం ముగింపు సమయానికి   ఇది రూ.109.61 లక్షల కోట్లుగా ఉంది.  

సాక్షి బిజినెస్ విభాగం
స్టాక్ మార్కెట్లు మంగళవారం మామూలుగానే ముగిశారుు. అత్యధికులు హిల్లరీనే గెలవవచ్చని భావించగా... వారం రోజులుగా వెలువడుతున్న పరస్పర విరుద్ధ సర్వేలతో కొందరు ట్రంప్ గెలుపునూ అంచనావేశారు. ఆ మేరకు మార్కెట్లు ఫలితమేదైనా తట్టుకోవటానికి సిద్ధమయ్యారుు కూడా. కానీ మంగళవారం రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామంటూ నల్లధనంపై ప్రధాని నరేంద్రమోదీ విసిరిన బాంబును ఎదుర్కోవటానికి ఎవరూ సిద్ధపడలేదు. అది ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో స్టాక్ మార్కెట్లకూ తొలుత అర్థం కాలేదు. ఆ గందరగోళంలోనే బుధవారం ఉదయం మార్కెట్లు ఆరంభమయ్యారుు. నిట్టనిలువునా పడిపోయారుు. అరుుతే ఎన్నో నెలల తర్వాత అత్యంత కనిష్టస్థారుులో లభ్యమవుతున్న బ్లూచిప్ షేర్లను సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేయడంతో మార్కెట్లు మెల్లగా కోలుకున్నారుు. ట్రేడింగ్ ముగింపు సమయానికి చాలావరకూ నష్టాల్ని స్టాక్ సూచీలు పూడ్చుకోగలిగారుు.

 1,689 నుంచి 339 పారుుంట్ల నష్టానికి!
ట్రేడింగ్ ప్రారంభమైన సెకండ్లలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,689 పారుుంట్ల (6 శాతంపైగా) పతనమై 26,251 పారుుంట్ల స్థారుుకి తగ్గింది. వెనువెంటనే షార్ట్ కవరింగ్‌తో నష్టం 1,100 పారుుంట్లకు తగ్గిపోరుుంది. అటుతర్వాత మధ్యాహ్న సమయం వరకూ అదేస్థారుువద్ద ఊగిసలాడి, ట్రేడింగ్ ముగింపులో శరవేగంగా కోలుకుని చివరకు 339 పారుుంట్ల (1.21 శాతం) నష్టంతో  27,252 పారుుంట్ల వద్ద ముగిసింది. మొత్తం మీద రోజులో 1,300 పారుుంట్ల నష్టాన్ని రికవరీ చేసుకోగలిగింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ దాదాపు 500 పారుుంట్ల మేర పతనమై 8,070 పారుుంట్ల కనిష్టస్థారుుని చూసింది. ఆపైన క్రమేపీ కోలుకుని 8,400 పారుుంట్లపైకి ఎగబాకింది. చివరకు 111 పారుుంట్ల నష్టంతో 8,432 పారుుంట్ల వద్ద ముగిసింది.

 ట్రంప్ ఎఫెక్ట్....ఫార్మా అప్, ఐటీ డౌన్
అమెరికాలో ట్రంప్ గెలిచిన ప్రభావంతో కనిష్టస్థారుు నుంచి వేగంగా రికవరీ అరుున షేర్లలో ఫార్మా షేర్లు ముందున్నారుు. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలిస్తే అమెరికాలో భారత ఫార్మాకే కాకుండా ప్రపంచ ఫార్మా ఉత్పత్తుల ధరల్ని నియంత్రించేందుకు కఠిన విధానాలు రూపొందుతాయన్న భయాలున్నారుు. ట్రంప్ గెలుపుతో ఈ భయాలు పోవడం వల్ల ఇన్వెస్టర్లు బుధవారం ఫార్మా షేర్ల కొనుగోళ్లకు తొలుత నడుంకట్టారు. దాంతో డాక్లర్ రెడ్డీస్ లాబ్ షేరు 5 శాతంపైగా ర్యాలీ జరిపి రూ. 3,290 స్థారుుకి పెరిగింది.

సన్‌ఫార్మా 4.5 శాతం పెరిగి రూ. 666 స్థారుుకి చేరింది. లుపిన్ 2 శాతం ఎగిసింది. మరోవైపు ట్రంప్ గెలిస్తే హెచ్1 వీసాలపై పరిమితులు పెరుగుతాయని, అవుట్‌సోర్సింగ్ కార్యకలాపాలు తగ్గిపోతాయన్న భయాలతో వున్న ఐటీ షేర్లు మాత్రం నష్టాలతో ముగిసారుు. టీసీఎస్, టెక్ మహీంద్రాలు 4 శాతంపైగా పతనమయ్యారుు. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 2 శాతం మేర క్షీణించింది. సెన్సెక్స్-30 షేర్లలో అదాని పోర్ట్స్, హీరో మోటో కార్ప్, ఐటీసీ, బజాజ్ ఆటో, మహింద్రా, మారుతి, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌లు వున్నారుు. పెరిగిన షేర్లలో ఫార్మా కంపెనీలతో పాటు ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, గెరుుల్‌లు వున్నారుు.

నోట్ల ఎఫెక్ట్....రియల్టీ షేర్లకు పెద్ద దెబ్బ...
మార్కెట్లో ట్రంప్ గెలుపు ప్రభావంకంటే పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఎక్కువగా కనపడింది. రూ. 500, రూ. 1000 నోట్లను రద్దుపర్చిన ప్రభావం రియల్టీ షేర్లపై తీవ్రంగా పడింది. ఇతర రంగాలకు చెందిన షేర్లు సాయంత్ర సమయానికి చాలావరకూ రికవరీ అరుునప్పటికీ, ఈ షేర్లు మాత్రం భారీ నష్టాలతో ముగిసారుు. ఒకదశలో 20 శాతంపైగా క్షీణించిన రియల్టీ షేర్లు డీఎల్‌ఎఫ్, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్ రియల్టీలు చివరకు 16-18% మధ్య నష్టపోరుు ముగిసారుు. ఇదేబాటలో రియల్టీ వ్యాపారంలో కూడా వున్న  సెంచురీ టెక్స్‌టైల్స్ 9%, దివాన్ హౌసింగ్ 10.5%, ఇండియాబుల్స్ హౌసింగ్ షేర్లు 7%  పతనమయ్యారుు.

నోట్ల రద్దు ఎఫెక్ట్ జ్యువలెరీ షేర్లపై కూడా పడింది. త్రిభువన్ దాస్ భీమ జావేరీ షేరు 14% పడిపోరుుంది. తంగమారుుల్ జ్యువెలరీ 12 శాతం, పీసీ జ్యువెలర్స్ 9 శాతం, శ్రీగణేష్ జ్యువెలరీ 7.5 శాతం, గీతాంజలి జెమ్స్ 6.5 శాతం పడిపోయారుు.

ప్రభుత్వ బ్యాంకులకు బూస్ట్...
పెద్ద నోట్లను రద్దుపర్చడంతో బ్యాంకులకు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రయోజనం కలుగుతుందనే అంచనాలతో ఈ షేర్లకు కనిష్టస్థారుు వద్ద భారీ కొనుగోలు మద్దతు లభించింది. నోట్ల రద్దు కారణంగా పెద్ద ఎత్తున ఆయా బ్యాంకుల్లో కరెంటు ఖాతాలు, సేవింగ్‌‌స (కాసా) ఖాతాల్లోకి నగదు డిపాజిట్లు తరలివస్తాయన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఏర్పడ్డారుు. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలతో పోలిస్తే ఈ కాసా డిపాజిట్లకు బ్యాంకులు చెల్లించే వడ్డీ నామమాత్రమే. పీఎస్‌యూ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ భారీ ట్రేడింగ్ పరిమాణంతో రూ.235 దిగువస్థారుు నుంచి 10% ఎగిసింది. చివరకు 3.5% లాభంతో రూ. 260 వద్ద ముగిసింది, పీఎన్‌బీ, బీఓబీ తదితర పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు భారీగా కోలుకుని పాజిటివ్‌గా ముగిసారుు. ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,  తదితర ప్రైవేటు బ్యాంకింగ్ షేర్లు కనిష్టస్థారుు నుంచి ఎగిశాయి.

సెన్సెక్స్ పడిలేచింది ఇలా..
గరిష్ట స్థాయి 27,397
కనిష్ట స్థాయి 25,902
ముగింపు 27,253

ఆసియా మార్కెట్లపైనే అధిక ప్రభావం
ట్రంప్ గెలిస్తే అమెరికాతో సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ పతనమవుతాయన్న అంచనాలు ఆసియా మార్కెట్ల విషయంలోనే కొంతవరకూ నిజమయ్యారుు. వారం రోజుల క్రితం ట్రంప్ గెలుపు అంచనాలుండటంతో ఆ సమయంలో బాగా పతనమైన అమెరికా సూచీలు బుధవారం కడపటి సమాచారం అందేసరికి ఆశ్చర్యకరంగా 0.5-1 శాతం మధ్య పాజిటివ్‌గా ట్రేడవుతున్నారుు. రెండు రోజుల నుంచి హిల్లరీ విజయం సాధిస్తున్న అంచనాలతో కూడా ఆ మార్కెట్లు పెరిగిన సంగతి తెలిసిందే.

ఇక ఆసియా మార్కెట్లలో జపాన్ 5 శాతంపైగా పడిపోరుుంది. తైవాన్ 3 శాతం, హాంకాంగ్  2 శాతం, సింగపూర్ 1 శాతం, చైనా 0.5 శాతం చొప్పున పతనంకాగా, భారత్ మార్కెట్ 1.2 శాతంపైగా నష్టపోరుుంది. గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన యూరప్ మార్కెట్లు చివరకు పెరిగి, ముగియడం విశేషం. స్విట్జర్లాండ్, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్‌‌స సూచీలు 1-2 శాతం మధ్య ర్యాలీ జరిపారుు. ట్రంప్ గెలుపుతో పెరుగుతుందన్న ముందస్తు అంచనాల ప్రకారమే రష్యా మార్కెట్ 2.2 శాతంపైగా ఎగిసింది.

Advertisement
Advertisement