భారత్ ద్రవ్య విధానానికి రుణాల అడ్డంకి! | Sakshi
Sakshi News home page

భారత్ ద్రవ్య విధానానికి రుణాల అడ్డంకి!

Published Tue, Jul 12 2016 1:27 AM

భారత్ ద్రవ్య విధానానికి రుణాల అడ్డంకి!

స్వేచ్ఛగా వ్యవహరించలేకుంటే ఇబ్బందులే   
మూడీస్ ఇన్వెస్టర్స్ నివేదిక అంచనాలు

న్యూఢిల్లీ: భారత్‌లో ద్రవ్య విధానాన్ని మరింత సరళీకరించడానికి అధిక రుణాలే అడ్డంకిగా నిలుస్తాయని రేటింగ్ సంస్థ మూడీస్ అభిప్రాయపడింది. అయితే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లిపోవటం వల్ల ఆసియా పసిఫిక్ దేశాల రుణాలపై చెప్పుకోదగ్గ ప్రభావం ఉండదని కూడా స్పష్టంచేసింది. ‘సార్వభౌమదేశాలు, బ్రెగ్జిట్, ఆసియా పసిఫిక్ దేశాలు; పరిమిత డెరైక్ట్ క్రెడిట్ ప్రభావం; కొన్ని దేశాల్లో మార్కెట్ హెచ్చుతగ్గులు’ అనే అంశాలను ప్రస్తావిస్తూ విడుదల చేసిన తాజా నివేదికలో మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఈ విషయాలు తెలియజేసింది.

బ్రెగ్జిట్‌కు సంబంధించి వచ్చే ప్రకటనలతో రానున్న నెలల్లో ఫైనాన్షియల్ మార్కెట్లు ఆటుపోట్లకు గురికావచ్చని సంస్థ పేర్కొంది. ‘‘బ్రిటన్‌లో తక్కువ జీడీపీ వల్ల ఇతర ప్రపంచ దేశాల వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. కాకపోతే బ్రిటన్‌తో ఆసియా పసిఫిక్ దేశాలకున్న వాణిజ్య ఒప్పందాలు పరిమితమేనని గుర్తుంచుకోవాలి. ఇదేమీ లెక్కలు వేసి చెబుతున్నది కాదుగానీ... పోర్ట్‌ఫోలియో, బ్యాంకింగ్ నిధులు మళ్లింపు వల్ల ఆసియా పసిఫిక్ దేశాల్లో నిధులకు కటకట ఏర్పడి వృద్ధికి విఘాతం కలిగే అవకాశముంది’’ అని మూడీస్ నివేదిక వివరించింది.

Advertisement
Advertisement