మొబైల్ యూజర్లు @103.5 కోట్లు | Sakshi
Sakshi News home page

మొబైల్ యూజర్లు @103.5 కోట్లు

Published Sat, Sep 10 2016 6:48 AM

మొబైల్ యూజర్లు @103.5 కోట్లు - Sakshi

టాప్-5లోకి మళ్లీ బీఎస్‌ఎన్‌ఎల్ ఎంట్రీ
న్యూఢిల్లీ: దేశంలోని మొబైల్ యూజర్ల సంఖ్య జూన్ చివరకి 103.5 కోట్లకు చేరింది. ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ మళ్లీ టాప్-5 టెలికం కంపెనీల జాబితాలో స్థానం దక్కించుకుంది. ట్రాయ్ గణాంకాల ప్రకారం.. మొత్తం టెలికం కస్టమర్ల సంఖ్య (వైర్‌లెస్, వైర్‌లైన్) 105.9 కోట్లుగా ఉంది. మే నెలలో 103.3 కోట్లగా ఉన్న మొబైల్  సబ్‌స్క్రైబర్ల (వైర్‌లెస్) సంఖ్య జూన్ చివరికి 0.19% స్వల్ప వృద్ధితో 103.5 కోట్లకు ఎగసింది. ఇదే సమయంలో వైర్‌లైన్ యూజర్ల సంఖ్య 2.48 కోట్ల నుంచి 2.47 కోట్లకు తగ్గింది.

 మొబైల్ యూజర్లలో ఎయిర్‌టెల్ టాప్
భారతీ ఎయిర్‌టెల్‌కు అత్యధికంగా 14 లక్షల మంది కొత్త యూజర్లు జతయ్యారు. దీంతో కంపెనీ మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 25.57 కోట్లకు చే రింది.

ఎయిర్‌టెల్ తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌కు కొత్త కస్టమర్ల సంఖ్య ఎక్కువగా పెరిగింది. దీనికి 13 లక్షల మంది జతయ్యారు. దీంతో కంపెనీ మొత్తం యూజర్లు 8.95 కోట్లకు చేరారు. ఈ చర్యతో బీఎస్‌ఎన్‌ఎల్ టాప్-5 మొబైల్ సర్వీసెస్ కంపెనీల జాబితాలో ఎయిర్‌సెల్‌ను వెన క్కు నెట్టి ఐదవ స్థానాన్ని కైవసం చేసుకుంది. కాగా బీఎస్‌ఎన్‌ఎల్ గతేడాది ఏప్రిల్‌లో ఈ ఐదవ స్థానం నుంచే కిందకు జారిపోయింది.

ఎయిర్‌సెల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య కొత్తగా 6.7 లక్షలు పెరిగింది. దీంతో కంపెనీ యూజర్లు 8.89 కోట్లకు చేరారు.

వొడాఫోన్‌కు యూజర్ల సంఖ్య 7 లక్షల పెరుగుదలతో 19.93 కోట్లకు ఎగసింది.

ఐడియా కస్టమర్ల సంఖ్య 6.8 లక్షలు పెరిగింది. మొత్తం యూజర్లు 17.62 కోట్లకు చేరారు.

Advertisement
Advertisement