50 కోట్లకు ఆన్లైన్ యూజర్లు: గూగుల్ | Sakshi
Sakshi News home page

50 కోట్లకు ఆన్లైన్ యూజర్లు: గూగుల్

Published Fri, Sep 16 2016 1:13 AM

50 కోట్లకు ఆన్లైన్ యూజర్లు: గూగుల్

భోపాల్: దేశంలో ఆన్‌లైన్ యూజర్ల సంఖ్య 2020 నాటికి 50 కోట్లకు చేరుతుందని గూగుల్ ఆసియా పసిఫిక్ లాంగ్వేజ్ హెడ్ రిచా సింగ్ చిత్రాంశి అంచనా వేశారు. స్మార్ట్‌ఫోన్స్ విని యోగం పెరుగుదల, ఇంటర్నెట్ వ్యాప్తి వంటి పలు అంశాలు దీనికి కారణంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ ఆన్‌లైన్ యూజ ర్లలో స్థానిక భాషను ఉపయోగించే వారే అధికంగా ఉంటారని తెలిపింది.అందుబాటు ధరల్లోని స్మార్ట్‌ఫోన్స్, డేటా ప్యాక్స్ వల్ల ఆన్‌లైన్ యూజర్ల సంఖ్య పెరగొచ్చని అభిప్రాయపడ్డారు.

ప్రస్తు తం దేశంలో 65% మంది స్మార్ట్‌ఫోన్స్ ద్వారానే ఎక్కువగా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. అలాగే చాలా మంది కొత్త వారు స్మార్ట్‌ఫోన్స్ ద్వారానే తొలిగా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేస్తున్నారని పేర్కొన్నారు. అశ్చర్యకరంగా వీరిలో అందరికీ ఆంగ్లం రాదని తెలిపారు. 35 కోట్ల మంది ఆన్‌లైన్ యూజర్లలో 15 కోట్ల మందికి స్థానిక భాషకే అధిక ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement