తయారీ, మైనింగ్ రంగాలు పేలవం | Sakshi
Sakshi News home page

తయారీ, మైనింగ్ రంగాలు పేలవం

Published Sat, Nov 12 2016 12:47 AM

తయారీ, మైనింగ్ రంగాలు పేలవం - Sakshi

సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి
స్వల్పంగా 0.7 శాతం వృద్ధి
ఏప్రిల్ నుంచీ చూస్తే 0.1 శాతం క్షీణత 

 న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబర్‌లో పేలవంగా కనిపించింది. కేవలం 0.7 శాతం వృద్ధి నమోదరుు్యంది. గత ఏడాది ఇదే నెలలో ఈ వృద్ధి 3.7 శాతం. అరుుతే ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా -0.7 శాతం క్షీణత నమోదరుు్యంది. అంటే నెలవారీగా కొంత బెటరన్నమాట.  ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ చూస్తే అసలు వృద్ధి లేకపోగా -0.1 శాతం క్షీణత నమోదరుు్యంది. గత ఏడాది ఇదే నెలల్లో వృద్ధి 4 శాతంగా ఉంది.  ఇక ప్రత్యేకించి గడచిన సెప్టెంబర్‌ను చూస్తే... మొత్తం సూచీలో దాదాపు 75 శాతం వాటా ఉన్న తయారీ రంగం, దీనితోపాటు మైనింగ్, భారీ యంత్ర పరికరాలకు సంబంధించి క్యాపిటల్ గూడ్‌‌స రంగాలు తీవ్ర ప్రతికూల ఫలితాలను నమోదుచేసుకున్నారుు. కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన లెక్కలను చూస్తే..

 తయారీ: 2015 ఇదే నెలతో పోల్చిచూస్తే వృద్ధి 2.7 శాతం నుంచి 0.9 శాతానికి పడిపోరుుంది. ఈ విభాగంలోని 22 గ్రూపుల్లో 12 సానుకూల వృద్ధిని నమోదుచేసుకున్నారుు. కాగా ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య ఈ రంగం 4.2% వృద్ధి 0.8% క్షీణతలోకి పడిపోరుుంది.

 క్యాపిటల్ గూడ్‌‌స: డిమాండ్‌కు ప్రతిబింబమైన 10.1 శాతం వృద్ధి రేటు - 21.6 శాతం క్షీణతలోకి జారిపోరుుంది.  ఆరు నెలల కాలంలో 7.8 శాతం వృద్ధి 21.4 శాతం క్షీణతలోకి చేరింది.

 మైనింగ్: వృద్ధి 3.5 శాతం నుంచి - 3.1 శాతం క్షీణతలో పడిపోరుుంది. ఆరు నెలల కాలంలో వృద్ధి లేకుండా అక్కడక్కడే ఉంది. గత ఏడాది ఇదే కాలంలో వృద్ధి 0.7 శాతం.

 విద్యుత్: వృద్ధి రేటు 11.4 శాతం నుంచి 2.4 శాతానికి చేరింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ చూస్తే వృద్ధి 4.5 శాతం నుంచి 5.1 శాతానికి ఎగసింది.

 వినియోగ వస్తువులు:  ఉత్పత్తి వృద్ధి 1.2 శాతం నుంచి 6 శాతానికి ఎగసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement