ఇన్సూరెన్స్‌ విభాగంలో భారీగా ఉద్యోగాలు | Sakshi
Sakshi News home page

ఇన్సూరెన్స్‌ విభాగంలో భారీగా ఉద్యోగాలు

Published Sat, May 30 2020 7:59 PM

Insurance Companies Plan To Recruit Employees - Sakshi

ముంబై: కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు తీవ్రంగా సతమవుతున్నారు. తాజాగా ఇన్సూరెన్స్‌ కంపెనీలు నిరుద్యోగులకు పండగ లాంటి విషయాన్ని ప్రకటించాయి. త్వరలోనే ఇన్సూరెన్స్ విభాగంలో 5,000 పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపాయి. అయితే నైపుణ్యమున్న అభ్యర్థులకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని కంపెనీలకు చెందిన ముఖ్య ప్రతనిధులు తెలిపారు. పీఎన్‌బీ మెట్‌ లైఫ్‌ అనే ఇన్సూరెన్స్ కంపెనీ 1,500 ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు ప్రకటించింది.

ఈ ఏడాది చివరి నాటికి మరో 3,000 ఉద్యోగ నియామకాలు చేపడతామని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. మరో వైపు కెనరా, హెచ్‌ఎస్‌బీసీ, ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ బ్యాంక్‌లు ఇన్సురెన్స్‌ విభాగంలో జూన్‌ నాటికి 1,000 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించాయి. టాటా, రిలయన్స్‌ నిప్పాన్‌లు 800 మందికి ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నాయి.

చదవండి: దిగ్గజ బ్యాంకులో 35 వేల ఉద్యోగాల కోత

Advertisement
Advertisement