రిటర్న్స్‌ ఫైలింగ్‌ మరింత సులభం | Sakshi
Sakshi News home page

రిటర్న్స్‌ ఫైలింగ్‌ మరింత సులభం

Published Thu, Mar 30 2017 12:27 AM

రిటర్న్స్‌ ఫైలింగ్‌ మరింత సులభం

న్యూఢిల్లీ: రిటర్న్స్‌ ఫైలింగ్‌ను కేంద్రం మరింత సులభతరం చేసింది.ఉద్యోగులకు సంబంధించి ఐటీఆర్‌ ఫామ్‌ను మరింత సరళతరం చేసింది. క్లిష్టతతో ఉన్న కొన్ని కాలమ్‌లను సవరిస్తూ, అలాగే ‘డిడక్షన్స్‌ కోరడానికి సంబంధించి’ మరికొన్ని కాలమ్స్‌ను చేర్చుతూ,  రూపొందించిన కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఫామ్‌ 1 ‘సహజ్‌’ ఏప్రిల్‌ 1 నుంచీ అమల్లోకి రానుంది.

ప్రక్రియను సరళతరం చేసి, మరింత మంది రిటర్న్స్‌ దాఖలు చేయడాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా తాజా చొరవ తీసుకున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దాదాపు 29 కోట్ల మందికి పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్లు ఉంటే, వీరిలో కేవలం ఆరు కోట్ల మంది మాత్రమే రిటర్న్స్‌ దాఖలు చేస్తున్నారు. కాగా ఏప్రిల్‌ 1 నుంచి జూలై 31 మధ్య ఆన్‌లైన్‌లోనూ ఐటీఆర్‌–1 ఫామ్‌ను దాఖలు చేసే వీలుంది.  

తోషిబా అమెరికా యూనిట్‌ దివాలా
వాషింగ్టన్‌: తీవ్ర నష్టాల్లో ఉన్న తోషిబా అమెరికా నూక్లియర్‌ యూనిట్‌ ‘వెస్టింగ్‌హౌస్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ’ న్యూయార్క్‌ కోర్టులో దివాళా రక్షణ పిటిషన్‌ను దాఖలు చేసింది. మోసపూరిత క్లెయిమ్‌లు, భారీ నష్టాలే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. వెస్టింగ్‌హౌస్‌ ఎలక్ట్రిక్, దాని అనుబంధ కంపెనీలు స్వచ్చందంగా అమెరికా దివాళా చట్టం చాప్టర్‌ 11 కింద ఈ పిటిషన్లు దాఖలు చేసినట్టు ప్రకటించింది.
 

Advertisement
Advertisement